సన్‌గ్లాసెస్ వల్ల ఒక కన్ను కోల్పోయిన యూఎస్ మహిళ... అదెలాగంటే..

కొన్ని సందర్భాలలో చాలా సురక్షితమైన వస్తువులే పెద్ద హాని కలిగిస్తుంటాయి.

కొన్నిటి వల్ల ఎలాంటి హాని జరగదని అనుకుంటారు కానీ అదృష్టం బాగోలేకపోతే అవే జీవితాంతం బాధపడే పరిస్థితికి తీసుకురావచ్చు.

తాజాగా అలాంటి ఒక ఊహించని చేదు అనుభవం యూఎస్‌ మహిళకు ఎదురైంది.ఆమె తన సన్ గ్లాసెస్( Sunglasses ) కారణంగా కారు ప్రమాదంలో ఓ కన్ను కోల్పోయింది.

సులభంగా పగిలిపోయే అద్దాలు ధరించడం వల్ల ఆమెకు ఈ పరిస్థితి వచ్చింది.వాటి వల్ల కలిగే ప్రమాదం గురించి ఇతర డ్రైవర్లను హెచ్చరించడానికి ఆమె తన కథనాన్ని టిక్‌టాక్ లో పంచుకుంది.2021లో తన కారు అకస్మాత్తుగా ఆగిన మరో కారును ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆమె చెప్పింది.ఆమె సమయానికి తన కారును ఆపలేకపోయింది.

గంటకు 25 మైళ్ల వేగంతో అతని కారును ఢీకొట్టింది.ఆ సమయంలో ఆమె ఖరీదైన డిజైనర్ సన్ గ్లాసెస్ ధరించింది.

Advertisement
US Woman Who Lost An Eye Due To Sunglasses, Sunglasses, Car Accident, Eye Injury

ఎయిర్ బ్యాగ్ ( Air bag )బయటకు వచ్చి ఆమె సన్ గ్లాసెస్ పగలగొట్టింది.సన్ గ్లాసెస్ చాలా గాజు ముక్కలుగా పగిలిపోయాయి.

Us Woman Who Lost An Eye Due To Sunglasses, Sunglasses, Car Accident, Eye Injury

కాసేపటికి అపస్మారక స్థితికి చేరుకుందని, నిద్ర లేచి చూసే సరికి కన్ను పోయిందని తెలిపింది.కన్ను గాజు ముక్కల ద్వారా పగిలి కారిపోయింది.ఆ సమయంలో ఆమె కనురెప్ప కిందికి వేలాడుతోందట.

దాంతో తనకు ఏమీ కనిపించలేదని అని చెప్పుకొచ్చింది.తన కన్ను గ్లాస్‌కు తగిలిందని, ఆప్టిక్ నరం, రెటీనా దెబ్బతిన్నాయని తెలిపింది.

కంటిని సరిచేయడానికి ఆరు శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది, కానీ ఆమె తన దృష్టిని తిరిగి పొందలేకపోయింది.ఆమెకు ఇప్పుడు నకిలీ కన్నుతో బతుకుతోంది.

Us Woman Who Lost An Eye Due To Sunglasses, Sunglasses, Car Accident, Eye Injury
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

ఇతర వ్యక్తులు కూడా అదే విషయాన్ని నివారించడంలో సహాయపడటానికి తన కథను చెప్పాలనుకుంటున్నట్లు ఆమె చెప్పింది.కొన్ని సన్ గ్లాసెస్ నైలాన్, ప్లాస్టిక్, గ్లాస్ వంటి సులభంగా పగిలిపోయే పదార్థాలతో తయారు చేయబడతాయని వెల్లడించింది.ఈ సన్ గ్లాసెస్ చాలా ప్రమాదకరమని, అవి పగిలిపోతే కళ్లకు హాని కలుగుతుందని వివరించింది.

Advertisement

బ్లూ ఐ అని పిలిచే పగిలిపోని సన్ గ్లాసెస్‌ని తయారు చేసే తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించానని ఆమె చెప్పింది.

తాజా వార్తలు