సిక్కు గురుద్వారాపై తూటాల వర్షం.. విస్కాన్సిన్ నరమేధానికి పదేళ్లు, బైడెన్ నివాళులు

అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.నగదు, నగలు కోసం హత్యలు చేసేవారు కొందరైతే.

జాతి, వర్ణ వివక్షలతో ఉన్మాదులుగా మారేవారు మరికొందరు.ఏది ఏమైనా అక్కడ గన్ కల్చర్ వల్ల ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

దీనికి చెక్ పెట్టాలని ప్రభుత్వాలు కృషి చేస్తున్నా.శక్తివంతమైన గన్ లాబీ ఈ ప్రయత్నాలను అడ్డుకుంటోందన్న వాదనలు వున్నాయి.

ఇక తుపాకీ కాల్పుల్లో భారతీయులు కూడా మరణిస్తున్నారు.కాగా, సరిగ్గా పదేళ్ల క్రితం ఆగస్టు 5, 2012న సిక్కు గురుద్వారాపై జరిగిన విషాద ఘటనను అధ్యక్షుడు జో బైడెన్ గుర్తు చేసుకున్నారు.

Advertisement

శుక్రవారం ఈ జాత్యహంకార దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారత సంతతికి చెందిన బాధితులకు ఆయన నివాళులర్పించారు.ఈ సందర్భంగా బైడెన్ ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘దేశీయ ఉగ్రవాదం’’, ‘‘శ్వేతజాతి దురహంకారం’’ సహా అన్ని రూపాల్లో వున్న ద్వేషాన్ని అంతం చేయడానికి, అమెరికాలో గన్ కల్చర్‌ను, ఆయుధాల వాడకాన్ని నిషేధించాలని బైడెన్ పిలుపునిచ్చారు.దురదృష్టవశాత్తూ గడిచిన దశాబ్ధ కాలంగా మనదేశంలోని ప్రార్థనా మందిరాలపై దాడులు సర్వసాధారణమయ్యాయని అధ్యక్షుడు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రార్థనలో తల వంచినప్పుడు ఎవరూ తమ ప్రాణాల కోసం భయపడాల్సిన అవసరం లేదని.అమెరికాలో స్వేచ్ఛగా జీవితాన్ని గడపొచ్చని జో బైడెన్ భరోసా కల్పించారు.

ఓక్ క్రీక్ సంఘటన తమకు మార్గాన్ని చూపిందన్న ఆయన.దాడి తర్వాత సిక్కు కమ్యూనిటీ సభ్యులు గురుద్వారాకు తిరిగి వచ్చి సాధారణ పరిస్ధితులు నెలకొల్పాలని బైడెన్ ప్రశంసించారు.సిక్కులు, ఇతర మైనారిటీ సమూహాలపై ద్వేషపూరిత నేరాలను గుర్తించాలని ఫెడరల్ ప్రభుత్వానికి పిలుపునిస్తూ.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

బాధితుల్లో ఒకరి కుమారుడు యూఎస్ కాంగ్రెస్ ఎదుట సాక్ష్యం చెప్పాడని అమెరికా అధ్యక్షుడు ప్రశంసించారు.దేశంలో తుపాకీ హింసను తగ్గించడానికి, మన తోటి అమెరికన్లను సురక్షితంగా ఉంచడానికి చర్యలు తీసుకోవాలని జో బైడెన్ పిలుపునిచ్చారు.

Advertisement

కాగా.ఆగస్టు 5, 2012లో విస్కాన్సిన్ రాష్ట్రంలోని ఓక్ క్రీక్ ప్రాంతంలో ఉన్న సిక్కు ప్రార్థనా మందిరంలో ఓ శ్వేతజాతీయుడు ఉన్మాదిలా ప్రవర్తించాడు.

గురుద్వారాలో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.ఈ ఘటనలో ఏడుగురు సిక్కులు ప్రాణాలు కోల్పోగా.

ముగ్గురు తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే.

తాజా వార్తలు