Urvashi Rautela : నిమిషానికి రూ.కోటి రెమ్యునరేషన్.. దేశంలో ఈ స్థాయిలో పారితోషికం తీసుకునేది ఈమె మాత్రమేనా?

ఊర్వశి రౌతేలా( Urvashi Rautela ). సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా ఈ పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే.

తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తోంది ఈ ముద్దుగుమ్మ.ఇకపోతే ఈ ముoద్దుగుమ్మ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ( Waltair Veeraiah )తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాతో భారీగా పాపులారిటీని ఏర్పరచుకుంది.అంతే కాకుండా ఈ సినిమా విడుదలకు ముందు విడుదల తర్వాత కొద్ది రోజులపాటు ఎక్కడ చూసినా కూడా ఈ ముద్దుగుమ్మ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోయింది.

ఈ మూవీ తర్వాత అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్‌ చిత్రం( Agent Movie )లోనూ ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది.ఇటీవలే ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఈఫిట్ టవర్‌ను వన్డే వరల్డ్‌ కప్‌ను ఆవిష్కరించిన ముద్దుగుమ్మ మరోసారి వార్తల్లో నిలిచింది.ఇలాంటి ‍అరుదైన అవకాశం దక్కించుకున్న ఏకైక నటిగా స్థానం దక్కించుకుంది.

Advertisement

అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈమె పారితోషకంకి సంబంధించి అనగనగాల వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఆ వివరాల్లోకి వెళితే.

ఆమె ఒక్కో సినిమాకు గాను నిమిషానికి రూ.కోటి రూపాయల రెమ్యునరేషన్‌( Urvashi Rautela Remuneration ) వసూలు చేస్తోందని గత కొద్ది రోజులుగా ఆమెపై రూమర్స్ వస్తున్నాయి.

అంతే కాదు ఆమెపై నెటిజన్స్ సైతం ట్రోల్స్ కూడా చేశారు.ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఈవెంట్‌కు హాజరైన ఊర్వశికి ఇలాంటి ప్రశ్నే ఎదురైంది.మీరు ఒక నిమిషానికి రూ.కోటి రూపాయలు వసూలు చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఈ విషయంపై మీరు ఏ విధంగా స్పందిస్తారు అని ప్రశ్నించగా.ఆ విషయంపై ఆమె స్పందిస్తూ.

నాలాంటి సెల్ఫ్ మేడ్ నటులు ఎవరైనా సరే ఇలాంటి విజయాలు సాధించాలని కోరుకుంటున్నా అంటూ సమాధానమిచ్చారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతోంది.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

ఇది చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.ఇకపోతే ఊర్వశి రౌతేలా సినిమాల విషయానికొస్తే.

Advertisement

ప్రస్తుతం వినీత్ కుమార్ సింగ్, అక్షయ్ ఒబెరాయ్‌లతో కలిసి దిల్ హై గ్రేలో( Dil Hai Gray ) నటించనుంది.అలాగే మరో తెలుగు సినిమాలో కూడా కనిపించనుంది ఈ బ్యూటి.

తాజా వార్తలు