అంగ వైకల్యం శరీరానికే కానీ లక్ష్యానికి కాదు.. ఈ సివిల్స్ ర్యాంకర్ సక్సెస్ స్టోరీ వింటే షాకవ్వాల్సిందే!

అంగవైకల్యం వల్ల నిరాశకు లోనై కెరీర్ పరంగా సక్సెస్ సాధించని వాళ్లు చాలామంది ఉన్నారు.

కొంతమందికి సరైన సపోర్ట్ లేక కెరీర్ పరంగా సక్సెస్ సాధించే విషయంలో ఫెయిల్ అవుతుండగా మరి కొందరు మాత్రం అన్నీ ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఫెయిల్ అవుతున్నాయి.

అయితే అంగ వైకల్యం శరీరానికే కానీ లక్ష్యానికి కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.అంగవైకల్యం ఉన్నా ఆ కసితోనే లక్ష్యాన్ని సాధించి ఒక యువతి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.

కేరళ రాష్ట్రంలోని( Kerala ) మలబార్ జిల్లాకు చెందిన కాజల్ రాజు( Kajal Raju ) కెరీర్ పరంగా సక్సెస్ అయిన తీరును చూస్తే ఒకింత ఆశ్చర్యానికి గురి కాక తప్పదు.ఈ ఏడాది విడుదలైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్( UPSC Civil Services ) ఫలితాలలో కాజల్ ఆల్ ఇండియా స్థాయిలో 910 ర్యాంకును సాధించడం గమనార్హం.

ప్రతిభ, పట్టుదలతో తన లోపాలను అధిగమించి ఈమె సక్సెస్ అయ్యారు.కుడిచేతి మణికట్టు లేకుండా జన్మించిన కాజల్ ఆత్మవిశ్వాసంతో కెరీర్ పరంగా ముందడుగులు వేశారు.

Upsc Civils Ranker Kajal Raju Success Story Details, Kajal Raju, Upsc Civils Ran
Advertisement
Upsc Civils Ranker Kajal Raju Success Story Details, Kajal Raju, Upsc Civils Ran

పాఠశాలలో చదివే సమయంలోనే కలెక్టర్ ( Collector ) కావాలనే బలమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నకాజల్ తొలి ప్రయత్నంలోనే సివిల్స్ కు అర్హత సాధించారు.కరెంట్ అఫైర్స్ పై పట్టు పెంచుకోవాలని, రోజూ వార్తా పత్రికలు చదవాలని సివిల్స్ లక్ష్యంగా పెట్టుకున్న వాళ్లకు కాజల్ రాజు సూచనలు చేస్తున్నారు.నా విశ్లేషనాత్మక నైపుణ్యాలు ఇంటర్వ్యూ చేసిన టీంకు బాగా నచ్చాయని ఆమె చెప్పుకొచ్చారు.

Upsc Civils Ranker Kajal Raju Success Story Details, Kajal Raju, Upsc Civils Ran

ఎన్నో కష్టాలను అనుభవించి సక్సెస్ అయిన కాజల్ రాజు కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.ప్రతిభ ఉంటే సక్సెస్ సాధించడం సాధ్యమేనని ఆమె చెబుతున్నారు.మంచి ర్యాంకు సాధించడంతో సంతోషంగా ఉందని కాజల్ రాజు చెప్పుకొచ్చారు.

సివిల్స్ ర్యాంకర్ కాజల్ రాజు చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు