వైరల్ అవుతున్న 'ఉప్పెన' డిలీట్ సీన్లు..!

బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమా భారీ విజయం ఆదుకున్న సంగతి అందరికి తేలిందే.

ఈ సినిమాతో మెగా హీరో వైష్ణవ తేజ్, కృతి శెట్టి తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైయ్యారు.

మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో ఇద్దరికి మంచి గుర్తింపు వచ్చింది.ఈ సినిమా విడుదలైన ఇన్ని రోజులకు ఇందులోని డిలీటెడ్ సన్నివేశాలను ఒక్కొక్కటిగా అప్‌లోడ్ చేస్తున్నాడు దర్శకుడు బుచ్చిబాబు.

,/br.ఇక ఈ రోజుల్లో పక్కాగా లెక్కలేసుకుని మరి రెండున్నర గంటల సినిమాలు తీసే దర్శకులు అరుదుగానే ఉన్నారు.

పూరీ జగన్నాథ్, అనిల్ రావిపూడి లాంటి ఒకరిద్దరు దర్శకులు మాత్రమే నిర్మాతలకు ఖర్చు తగ్గిస్తూ పక్కా సినిమాలు తీస్తుంటారు.మిగిలిన చాలా మంది దర్శకులు రెండున్నర గంటలంటే మూడున్నర గంటల సినిమాలు చేస్తున్నారు.

Advertisement
Uppena Deleted Scence Goes To Viral Uppena, Vaishnav Tej, KruthI Shetty, Viral

సుకుమార్, రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకులు ఈ కేటగిరీలోకే వస్తుంటారు.Uppena Deleted Scence Goes To Viral Uppena, Vaishnav Tej, Kruthi Shetty, Viral

వాళ్లు ఒక్క సినిమా చేయమంటే రెండు సినిమాలకు సరిపోయే నిడివి తెరకెక్కిస్తుంటారు.రిలీజ్ టైమ్‌లో ఎడిటింగ్ రూమ్‌లో కుస్తీ పడుతుంటారు.ఏ సీన్ తీయాలో ఏ సీన్ ఉంచాలో తెలియక తిప్పలు పడుతుంటారు.

తాజాగా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు కూడా ఇదే చేశాడు.ఈయన కూడా తన తొలి సినిమా ఉప్పెన కోసం భారీగానే చేసాడు.

ఇక ఇప్పుడు ఆ డిలీట్ చేసిన సన్నివేశాలను ఒక్కొక్కటిగా యూ ట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్నాడు.ఉప్పెన నుంచి విడుదలైన రెండు డిలీటెడ్ సన్నివేశాలు అభిమానులను బాగానే ఆకట్టుకుంటున్నాయి.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

ముఖ్యంగా తన కాలనీ అమ్మాయితో వైష్ణవ్ తేజ్ చేసిన కామెడీ అదిరిపోయింది.హీరోయిన్‌కు లవ్ లెటర్ ఇప్పించడానికి హీరో పడే ప్రయత్నాలు ఫన్నీగా అనిపించాయి.

Advertisement

అంతేకాదు ఈ సీన్ కోసం గోదారి జిల్లాలో పాడుకునే సరదా పాటను కూడా పెట్టాడు దర్శకుడు బుచ్చిబాబు.దాంతో పాటు విజయ్ సేతుపతి, రాజీవ్ కనకాల మధ్య వచ్చే సీన్ కూడా బాగానే ఉంది.

కానీ ఈ రెండు సన్నివేశాలు కూడా పెద్దగా ప్రాముఖ్యత లేనివే.అందుకే వాటిని పక్కనబెట్టాడు దర్శకుడు.

ఇంకా ఇలాంటి సీన్స్ ఎన్ని ఉన్నాయో ఇప్పుడే లెక్కేయడం కష్టం.ఎందుకంటే రోజుకో సీన్ యూ ట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నాడు బుచ్చిబాబు.

తాజా వార్తలు