బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ కేంద్ర మంత్రి ఉప్పలపాటి కృష్ణంరాజు రాజకీయ పరిస్థితి ఎవరికీ అర్ధంకాకుండా ఉంది.ఆయనకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం దక్కకపోయినా బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అంతే కాదు ఎప్పటి నుంచో ఆయనకు గవర్నర్ పదవి కూడా దక్కబోతోంది వార్తలు కూడా వినిపించాయి.అయితే ఆయన ఆశ మాత్రం తీరనే లేదు.
బాహుబలి సినిమా విడుదల అయిన తరువాత ప్రభాస్‌ను తీసుకుని ప్రధాని మోదీని కూడా వెళ్లి కలిశారు.చాలానే హడావుడి చేశారు.
తనకు ఏదైనా నామినేటెడ్ పదవి ఇవ్వాలంటూ ఎన్నో రకాలుగా ప్రయత్నించారు.అయితే కృష్ణంరాజు అభ్యర్ధనను అమిత్ షా, మోదీ ఇద్దరూ పరిగణనలోకి తీసుకోలేదు.
ఈ మధ్యకాలంలో బీజేపీ ఎంతోమందిని గవర్నర్ లుగా ఎంపిక చేసింది.అయితే వాటిల్లో కృష్ణం రాజు పేరు మాత్రం కనిపించలేదు.

ప్రస్తుతం తనకు గవెర్నర్ పదవి దక్కకపోవడంతో కొంత అసంతృప్తిగానే ఉన్నట్టు కనిపిస్తున్నా గట్టిగా ప్రయత్నిస్తే ఏదో ఒక నామినేటెడ్ పదవి ఖచ్చితంగా దక్కుతుంది అనే ఆలోచనలో కృష్ణం రాజు ఉన్నట్టు కనిపిస్తోంది.ప్రస్తుతానికి అయితే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు.ఇదే సమయంలో పార్టీ హైకమాండ్ దృష్టిలో పడేలా టీడీపీ అధినేత చంద్రబాబు మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ తన ఉనికిని చాటుకుంటున్నారు.మామూలుగానే చంద్రబాబు అంటే బీజేపీ నేతలకు కోపం దాన్ని ఇప్పుడు కృష్ణంరాజు మరో రకంగా ఉపయోగించుకుంటున్నాడు.
తన మాటలకు పదును పెట్టి మరీ చంద్రబాబును చచ్చిన పాము అంటూ విమర్శలు చేసారు.అబద్దాలు మాట్లాడటం, మోసాలు చేయడంలో చంద్రబాబు మాస్టర్ డిగ్రీ చేశారని విమర్శలు గుప్పించారు.
ప్రస్తుతం కృష్ణం రాజు చేస్తున్న విమర్శలన్నీ తాను బీజేపీలో బాగా యాక్టివ్ రోల్ పోషిస్తున్నాను అని చెప్పుకోవడానికే అన్నట్టుగా ఉంది.గవర్నర్ పదవి పొందాలనేది కృష్ణంరాజు ప్రథమ కోరికగా ఉంది.
అయితే కృష్ణంరాజుపై హైకమాండ్‌కు సానుకూల దృక్పథం లేదని, ఏపీ బీజేపీ నేతలే చెబుతున్నారు.గతంలో టీడీపీతో పొత్తు ఉన్నప్పుడు మాత్రమే ఆయన ఎంపీగా గెలిచారు.
ఆ తర్వాత.బీజేపీని వదిలి పెట్టి వెళ్లిపోయారు.
పీఆర్పీలో చేరారు.మళ్లీ బీజేపీ పరిస్థితి మెరుగయిన తరువాత మళ్ళీ ఈ పార్టీలో చేరారు.
అందుకే కృష్ణంరాజుపై బీజేపీ పెద్దలు పెద్దగా ఆసక్తి చూపడంలేదని పార్టీలోని నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.ఆయనకు గవర్నర్ పదవి కాదు కదా ఎటువంటి నామినేటెడ్ పోస్ట్ కూడా దక్కే అవకాశమే లేదని ధీమాగా చెబుతున్నారు.