స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ( Chandrababu )అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.జాతీయస్థాయిలో నేతలు మరియు జాతీయ మీడియా అరెస్టు చేసిన విధానాన్ని తప్పుపడుతూ ఉంది.
ఇప్పటికే వివిధ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి కొంతమందికేలక నాయకులు.చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.
తాజాగా తెలంగాణ బీజేపీ పార్టీ నేత బండి సంజయ్( Bandi Sanjay ).చంద్రబాబు అరెస్టు పట్ల స్పందించారు.ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబుని అరెస్టు చేసిన విధానం సరికాదని అన్నారు.
ఎఫ్ఐఆర్( FIR ) లో పేరు లేకుండా సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని అర్ధరాత్రి అరెస్టు సరికాదని పేర్కొన్నారు.
ఈ విధంగా చంద్రబాబుని అరెస్టు చేయడంతో ఏపీ ప్రజలలో తెలుగుదేశం పార్టీపై సానుభూతి పెరిగిందని వ్యాఖ్యానించారు.అవినీతిపై ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోవాలని.చట్టానికి అందరూ సమానమే.ఎవరు అతీతులు కాదు అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
చంద్రబాబు అరెస్ట్ పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.ఈ విషయంలో కక్షపూరితంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందని కామెంట్లు చేస్తున్నారు.
ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్నారు.