పోక్సో కేసులోని ఐదుగురు నిందుతులకు 20 సం,రాలు జైలు శిక్ష, జరిమానా

చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన యువకుడితో పాటు మరో నాలుగురికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 25 వేల రూపాయల జరిమానా విధిస్తూ .1వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు జడ్జి గౌరవ శ్రీమతి కె.ఉమదేవి తీర్పు వెలువరించారు.కారేపల్లి మండలం, భల్లూనగర్ గ్రామానికి చెందిన బానోత్ లక్ష్మణ్ (19) అనే యువకుడు 15 ఏళ్ల చిన్నారిపై కన్నేశాడు.

 20 Years Imprisonment And Fine For Five Accused In Pocso Case-TeluguStop.com

ఇంటినుండి ఎత్తుకెళ్లి ఆభంశుభం తెలియని బాలికపై అత్యాచారం చేశాడు.ఈ ఘటన కారేపల్లి పోలీస్ స్టేషన్ లో 2021 ఫిభ్రవరి 1 న బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో U/S:366A,376 r/w109,34IPC సెక్షన్ 3 r/w 4,17 &21 of Pocso చట్టం కేసు నమోదు చేసిన కారేపల్లి పోలీసులు విచారణ చేపట్టారు.దర్యాప్తులో మొత్తం ఐదుగురు నిందుతుల పాత్ర వుండటంతో పకడ్బందిగా సాక్ష్యాలు సేకరించి న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేశారు.కేసు రుజువు కావడంతో 1వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు జడ్జి జైలు శిక్ష,జరిమానా విధించారు.A-1 బానోత్ లక్ష్మణ్ (19) విద్యార్థి, భల్లు నగర్ తండా కారేపల్లి మండలం.A-2 బానోత్ శ్రీను (43) భల్లూనగర్ తాండా(V), కారేపల్లి (M).A-3 బానోత్ సరోజ (40) సంవత్సరాలు, భల్లూ నగర్ తాండా (V), కారేపల్లి (M).A-4 తేజావత్ దేవి (32) సారపాక గ్రామ బూర్గంపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.A- 5 అజ్మీరా లక్ష్మి ( 35) ఖానాపురం హవేలి ఖమ్మం అర్బన్ మండలం.

నిందుతులకు శిక్ష పడటంలో కీలకపాత్ర పోషించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్, కొత్త వెంకటేశ్వరరావు ఇన్వెస్టిగేషన్ అధికారి పి.సురేష్ SI, బి.శ్రీనివాసులు సిఐ, వి.భద్రు నాయక్ ఎస్‌ఐ,K.మోహన్ రావు HC CDO: T.వెకటేశ్వర రావు HC, ఎం.ఉమారాణి (లీగల్ సపోర్ట్ ఆఫీసర్ భరోసా సెంటర్) కోర్ట్ హోంగార్డు : Md.యాకుబ్ ను పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ అభినందించారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube