ఇళ్ళ స్థలాల కోసం యూనివర్సిటీ భూములు! పద్ధతి కాదన్న ఉండవల్లి

పేదలకి ఇళ్ళ స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని వైసీపీ సర్కార్ సీరియస్ గా తీసుకుంది.

అయితే దీని కోసం ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు, అలాగే విద్యాసంస్థలకి కేటాయించిన భూములని సైతం సేకరిస్తుంది.

అలాగే గతంలో ఎస్సీ, ఎస్టీలకి ఇచ్చిన అసైన్డ్ భూములని స్వాధీనం చేసుకొని వాటిని తిరిగి పేదలకి ఇవ్వడానికి రెడీ అవుతుంది.అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకమైన భూసేకరణపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే విపక్షాలు, కమ్యూనిస్ట్ లు కూడా వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు.అయిన కూడా జగన్ ఆదేశాలతో అధికారులు ఎవరిని లెక్క చేయకుండా భూసేకరణ చేసే పనిలో పడ్డారు.

ఇదిలా ఉంటే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం బొమ్మూరులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి చెందిన భూములను ఇళ్లస్థలాలుగా కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.దీనిపై విద్యార్ధి సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

ఇదిలా ఉంటే ఈ నిర్ణయంపై మాజీ ఎంపీ ఉండవల్లి ముఖ్యమంత్రి జగన్ కి లేఖ రాశారు.తెలుగు యూనివర్సిటీకి చెందిన 20 ఎకరాల భూములను ఇళ్లస్థలాల కోసం సేకరించాలని కలెక్టర్‌ ప్రొసీడింగ్స్‌ను జారీ చేసినట్లు తెలుసుకున్నట్లు ఉండవల్లి తెలిపారు.

యూనివర్సిటీ భూములను ఇళ్లసలాల సేకరణకు కుదరదని ఆ లేఖలో పేర్కొన్నారు.రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఉమ్మడిగా ఉన్న ఐదు తెలుగు యూనివర్సిటీ క్యాంపస్‌ల పంపకాలు జరగలేదని అన్నారు.

వర్సిటీ విభజన జరగకుండా ఆ యూనివర్సిటీ భూములను సేకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు.దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు తప్పనిసరి అని పేర్కొన్నారు.

మరి దీనిపై వైసీపీ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ లోక్ సభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న సీపీఎం..!!

Advertisement

తాజా వార్తలు