టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంత త్వరగా ఎదుగుతారో అంతే త్వరగా ఫేడవుట్ అవుతారు.దీనికి తాజా ఉదాహరణగా అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ నిలిచింది.
పంజాబీ బ్యూటీ రకుల్ తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలో యంగ్ స్టార్ హీరోలందరితో నటించే అవకాశం దక్కించుకుంది.ఒక సందర్భంలో ఆమె ఎంత బిజీగా ఉందంటే, స్టార్ హీరోలు ఆమె డేట్ల కోసం వేచి చూసేవారు.
ఒక్కో సందర్భంలో ఆమె డేట్లు అడ్జస్ట్ కాకపోవడంతో స్టార్ హీరోల సినిమాలకు నో చెప్పింది.ఏకంగా మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాకు కూడా డేట్లు లేవని ఆమె నో చెప్పిన సంగతి తెలిసిందే.
కానీ ప్రస్తుతం ఆమెకు తెలుగులో ఒక్కటంటే ఒక్క సినిమా ఆఫర్ కూడా లేదు.దీనికి కారణం ఆమె చేసిన తప్పే అంటూ రకుల్ బాధపడుతోంది.
కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నప్పుడు నటనకు ప్రాధాన్యం ఇవ్వకుండా కేవలం గ్లామర్ షోలు చేసి చాలా పెద్ద తప్పు చేశానంటూ రకుల్ ఫీల్ అవుతోందట.
స్టార్ హీరోయిన్‌గా ఉన్నప్పుడు కేవలం స్టార్ హీరోల సినిమాల్లో గ్లామర్ పాత్రలే రావడం, తనలోని నటిని పూర్తిగి వినియోగించుకో లేకపోవడంపై ఆమె ఇప్పుడు బాధపడుతుంది.
ఈ విషయం తెలుసుకున్న పలువురు రకుల్ ప్రస్తుత పరిస్థితిపై జాలి పడుతున్నారు.ఏదేమైనా సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి కొంత వరకే టైమ్ ఉంటుందని, దాన్ని పూర్తిగా వినియోగించుకోవడంలో రకుల్ వెనుకబడిందని పలువురు అంటున్నారు.