TDP Janasena : టీడీపీ, జనసేన అభ్యర్థుల ప్రకటనపై వీడని సందిగ్ధత..!

ఏపీలో ఎన్నికలు( AP Elections ) సమీపిస్తున్న తరుణంలో పొత్తుల వ్యవహారంతో రాష్ట్ర రాజకీయ పరిణామాలు మారుతున్నాయి.

ఈక్రమంలోనే టీడీపీ, జనసేన పొత్తు( TDP Janasena Alliance ) నేపథ్యంలో వారి అభ్యర్థుల ప్రకటనపై సందిగ్ధత కొనసాగుతోంది.

తాజాగా టీడీపీ, జనసేన అభ్యర్థుల ప్రకటనపై బీజేపీ ప్రభావం పడిందని తెలుస్తోంది.ఈనెల 14న అభ్యర్థులను ప్రకటించాలని టీడీపీ, జనసేన భావించగా.

చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో( Chandrababu Delhi Tour ) ప్రకటన వాయిదా పడింది.చంద్రబాబు ఢిల్లీ పర్యటన అనంతరం పరిణామాలు మారాయని సమాచారం.

దీంతో అభ్యర్థుల ప్రకటనకు మరో పది రోజులు పట్టే అవకాశం ఉంది.అయితే చంద్రబాబు, అమిత్ షా మధ్య సీట్ల సర్దుబాట్లపై చర్చలు కొలిక్కిరాలేదు.ఈ క్రమంలోనే మరోసారి బీజేపీ పెద్దలతో సమావేశం కావాలని చంద్రబాబు యోచిస్తున్నారని సమాచారం.

Advertisement

మరోవైపు ఢిల్లీ పెద్దల పిలుపు కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ఎదురు చూస్తున్నారు.టీడీపీ, జనసేన మరియు బీజేపీ పొత్తుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

అమ్మమ్మ చీర కట్టుకోవాలని ఉంది...ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను : సాయి పల్లవి
Advertisement

తాజా వార్తలు