బ్రిటన్‌లో ఫ్యూయెల్ కొరత: పెట్రోల్ లేదన్నందుకు.. భారతీయ మహిళపై దాడి, వీడియో వైరల్

బ్రిటన్‌లో పెట్రోల్, డీజిల్ సమస్య నానాటికీ జఠిలమవుతోంది.పరిస్ధితి అదుపులోనే వుందని ప్రధాని బోరిస్ జాన్సన్ చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో పరిస్ధితులు దారుణంగా వున్నాయి.

చమురు కంపెనీలు, రిఫైనరీల నుంచి ఫిల్లింగ్ స్టేషన్లకు పెట్రోల్, డీజిల్ తరలించడానికి ట్యాంకర్ డ్రైవర్ల కొరత వేధిస్తోంది.దీంతో గడిచిన వారం రోజులుగా ఫిల్లింగ్ స్టేషన్‌ల వద్ద విపరీతంగా రద్దీ నెలకొంది.

ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డు కనిపిస్తుండంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.కొన్ని చోట్ల పెట్రోల్ కోసం ప్రజలు.

బంకుల యజమానులు, సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు.తాజాగా పెట్రోల్ లేదన్నందుకు అసహనానికి గురైన కొందరు స్థానికులు .భారతీయురాలిపై దాడి చేశారు.వివరాల్లోకి వెళితే.

Advertisement

నెరాలీ పటేల్ (38) అనే భారత సంతతి మహిళ ఉత్తర లండన్‌లోని హవర్ స్టాక్ హిల్‌లో బీపీ పెట్రోల్ పంప్ నడుపుతున్నారు.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెట్రోల్ కొరత ఉండడంతో ఆమె వద్ద కూడా ఫ్యూయెల్ నిండుకుంది.

అయితే ఓ రోజున కొందరు యువకులు బైక్‌లపై పటేల్ షాపు వద్దకు చేరుకుని పెట్రోల్ కావాలని అడిగారు.అయితే అందుకు నెరాలీ లేదని సమాధానం చెప్పడంతో వారంతా ఆమెపై దాడికి దిగారు.

గుంపులోని ఓ వ్యక్తి పటేల్‌ను ‘పాకీ (పాకిస్తానీలను బ్రిటిషర్స్ తిట్టే తిట్టు)’ అని తిడుతూ కిందకీ తోసేశాడు.బలంగా కిందపడటంతో ఆమె తల నేలకు కొట్టుకుని తీవ్ర గాయమైంది.

అలాగే ఆమె చేతికి కూడా దెబ్బతగిలింది.అయినప్పటికీ అగంతకులు ఆగకుండా ఆమెను అసభ్యంగా దూషిస్తూ చితకబాదారు.

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ హెచ్చరిక..!!
10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!

ఇంతలో అటుగా వెళుతున్న కొందరు వారిని అడ్డుకుని పోలీసులకు అప్పగించి.నెరాలీని ఆసుపత్రికి తరలించారు.

Advertisement

ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొదుతున్నారు.ఫిర్యాదు అందుకున్న వెంటనే నిందితుడిని అరెస్టు చేశామని, కేసు కూడా నమోదు చేశామని చెప్పిన పోలీసులు.

ఆ తర్వాత విడిచిపెట్టేశారు.అయితే విచారణ మాత్రం కొనసాగుతోందని చెబుతున్నారు.

బ్రిటన్‌ను దాదాపు 1,00,000 మంది డ్రైవర్ల కొరత వేధిస్తోంది.దేశంలోని మొత్తం 8,380 ఫిల్లింగ్ స్టేషన్‌లలో మూడింట రెండు వంతుల వాటాను కలిగి వున్న ఇండిపెండెంట్ రిటైలర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న పెట్రోల్ రిటైలర్స్ అసోసియేషన్ (పీఆర్ఏ) తమ స్టేషన్‌లలో 37 శాతం ఇంధనం ఖాళీ అయ్యిందని తెలిపింది.

ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధ అయిన బ్రిటన్‌ను తాజా పెట్రోల్ సంక్షోభం గందరగోళానికి గురిచేసింది.

దీనికంతటికి కారణం బ్రెగ్జిట్ (యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం).ఇది గతేడాది జనవరి నుంచి అమల్లోకి వచ్చింది.దీంతో యూకేలో కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

ఫలితంగా ఇతర ఈయూ దేశాల కార్మికులు బ్రిటన్‌లో నివసించడానికి, వీసా లేకుండా పని చేయడానికి గతంలో ఇచ్చిన అనుమతులు రద్దయ్యాయి.అరెస్ట్‌ల భయంతో గత ఏడాది నుంచి యూకే నుంచి పలు దేశాల కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు.

దీంతో బ్రిటీష్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది.సైనికులు చమురు కంపెనీలు, రిఫైనరీల నుంచి పెట్రోల్ ట్యాంకర్లను నడుపుతూ ఫిల్లింగ్ స్టేషన్ వద్దకు తీసుకెళ్తున్నారు.

తాజా వార్తలు