ఇల్లు క్లీన్ చేసి రూ.74 వేలు చెల్లించమని భార్యను అడిగిన యూకే హస్బెండ్?

యూకే( UK )కి చెందిన ఒక వ్యక్తి తన భార్యకు పెద్ద షాక్ ఇచ్చాడు.ఆరు గంటలపాటు తన ఇంటిని శుభ్రం చేసిన తర్వాత 700 పౌండ్ల (సుమారు రూ.

73,955) బిల్లును చెల్లించమని భార్యను కోరాడు.సాధారణంగా ఇల్లు క్లీన్ చేసే బాధ్యత ఆడవారిదే.

ఆ పని భార్యకు బదులుగా తాను చేసినందుకు అతడు ఇంత డబ్బులు అడిగినట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కథనం వైరల్ గా మారింది. డైలీ టెలిగ్రాఫ్ ఈ కథనాన్ని నివేదించింది.

కొంతమంది ఇది అన్యాయం లేదా సెక్సిస్ట్ అని కామెంట్లు చేశారు.చాలా మంది మహిళలు ఉచితంగా ఇంటిపనులు చేస్తున్నప్పుడు అతను ఎందుకు డబ్బు పొందాలి? అని కొందరు ప్రశ్నించారు.అయితే ఈ స్టోరీ వెనుక ఉన్న అసలైన కారణం తెలిస్తే సదరు భర్తపై పెద్దగా కోపం రాకపోవచ్చు.

Advertisement

ఈ హస్బెండ్ సొంత క్లీనింగ్ బిజినెస్ నడుపుతున్నాడు.అతని పేరు మార్క్ హాచ్, అతని వ్యాపారాన్ని "క్లీన్ మీ కార్పెట్, అప్హోల్స్టరీ క్లీనింగ్" అని పిలుస్తారు.

ఇటీవల అతనికి క్లయింట్‌గా తన వైఫ్ సంప్రదించింది.ఇల్లు క్లీన్ చేయాలని ఆమె కాల్ చేసింది.

నిజానికి భర్త తన భార్య, ముగ్గురు పిల్లలతో అక్కడే నివసిస్తున్నాడు.కష్టపడి పని ముగించుకుని తన భార్య జాస్మిన్( Jasmine ) కి కస్టమర్ లాగా బిల్లు పంపించి తమాషా చేద్దాం అనుకున్నాడు.

ఈ బిల్లును ఫేస్‌బుక్ పేజీలో కూడా పోస్ట్ చేశాడు."గత వారం, ఒక కస్టమర్ డబ్బు చెల్లించడానికి నిరాకరించింది.ఒక పెద్ద మూలలో సోఫా, మూడు బెడ్‌రూమ్ కార్పెట్‌లు, ఒక అంతస్తును శుభ్రపరిచిన తర్వాత, కస్టమర్ సంతోషించినట్లు మాకు తెలియజేసింది! ఎంతో సంతోషించి బిల్లు పంపించాం.

వీడియో: పాకిస్థాన్‌లో ప్రాంక్ చేసిన యువకులు.. లాస్ట్‌కి దిమ్మతిరిగే ట్విస్ట్..?
వైరల్ వీడియో : కారుతో ఢీకొట్టి పరారైన బీజేపీ అధ్యక్షుడి కుమారుడు..

హాయ్ జాస్మిన్, నిన్నటి క్లీన్‌కు పేమెంట్ లింక్‌ను దయచేసి లింక్‌ని క్లిక్ చేసి, మీకు ఇష్టమైన చెల్లింపు పద్ధతిని ఎంచుకోండని చెప్పాం." అని సదరు హస్బెండ్ ఫేస్‌బుక్ పేజీలో పోస్టులు రాశాడు.

Advertisement

అయితే భార్య దీనికి ఒక ఫన్నీ రిప్లై ఇచ్చింది." అయ్యా, బాబు.

ఓ విషయం గుర్తు చేసుకోండి, మనం ముగ్గురు పిల్లలు గల భార్యాభర్తలం." అని ఆమె రిప్లై ఇచ్చింది.

అది చదువుకొని హస్బెండ్ బాగా నవ్వుకున్నాడు.హస్బెండ్ ఫేస్‌బుక్‌ పోస్ట్ చూసి నెటిజన్లు కూడా నవ్వుకున్నారు.

తాజా వార్తలు