కరోనా బారిన పడ్డ వైసీపీ ఎంపీలు..!!

మహమ్మారి కరోనా మూడోసారి దేశంలో ఎవరిని కనికరించడం లేదు.ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ వ్యాప్తి చెందటం లో ఊహించని రీతిలో దూసుకుపోతూ ఉంది.

 Two Ysrcp Mp's Tested Corona Positive Ysrcp, Margani Bharat, Vangha Geetha,-TeluguStop.com

సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకులు ఎవరిని విడిచి పెట్టడం లేదు.దీంతో దేశంలో రెండు మూడు వారాల వ్యవధిలోనే లక్షల్లో కొత్త కేసులు నమోదు అయ్యే పరిస్థితి ఏర్పడింది.

పరిస్థితి ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీకి చెందిన నాయకులు తాజాగా కరోనా బారిన భారీగా పడుతున్నారు.మొన్ననే మంత్రి కొడాలి నాని కరోనా బారిన పడగా తాజాగా ఇద్దరు వైసీపీ ఎంపీలు కరోనా బారిన పడ్డారు.

కాకినాడ ఎంపీ వంగా గీత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కు కరోనా సోకింది.వంగా గీత పీఏ, ఆమె గన్ మెన్ కు కూడా పాజిటివ్ నిర్ధారణ అయింది.

వీళ్లంతా డాక్టర్ల సూచనలు సలహాల మేరకు హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు.వైసీపీ లో వేలు మాత్రమే కాక అంబటి రాంబాబు.

పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి కూడా కరోనా బారిన పడటం జరిగింది.ఇక తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా కరోనా బారిన పడటం జరిగింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా విపరీతంగా కరోనా కేసులు నమోదు అవుతున్నా… ఈ కొత్త వేరియంట్ వల్ల చాలా వరకు ప్రాణాపాయం లేదని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube