ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఆరు నెలలలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.వచ్చే ఎన్నికలకు తెలుగుదేశం జనసేన ఏపీలో కలిసి పోటీ చేస్తున్నాయి.
అధికారంలో ఉన్న వైసీపీని దించడమే తమ లక్ష్యం అని ఇరు పార్టీలకు చెందిన నాయకులు అంటున్నారు.ఇదే సమయంలో ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.
పరిస్థితి ఇలా ఉంటే తాజాగా “తెలుగుదేశం జనసేన” పొత్తుపై వైసీపీ మంత్రి కొట్టు సత్యనారాయణ ( Minister Kottu Satyanarayana )సంచలన వ్యాఖ్యలు చేశారు. “తెలుగుదేశం జనసేన” ( “Telugudesam Janasena )మధ్య పొత్తు కుదిరిన గాని ఆ రెండు పార్టీల కేడర్ మధ్య ఆదిపత్య పోరాటాలు జరుగుతున్నాయని తెలిపారు.
ఇదే సమయంలో చంద్రబాబు( Chandrababu ) రాజకీయాలనుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు.అనేక రోగాలు ఉన్నట్టు ఆయన తన బెయిల్ పిటిషన్ లో తెలియజేయడం జరిగింది.
హాథీరామ్ మఠానికి చెందిన మహంతి అర్జున్ దాస్ ను తొలగిస్తూ ధార్మిక పరిషత్ నిర్ణయించింది.ఆయనపై 16 అభియోగాలు రుజువయ్యాయి.3 మెన్ కమిటీ ఇచ్చిన నివేదిక సిఫార్సు మేరకు అర్జున్ మహంతాను తొలగిస్తూ ధార్మిక పరిషత్ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది.ఆయన స్థానంలో రమేష్ నాయుడు( Ramesh Naidu ) అనే వ్యక్తిని మఠం బాధ్యులుగా నియమించాం.ఏపీపీఎస్సీ ద్వారా 59 మంది గ్రేడ్ 3 ఈవోల నియామకం చేపట్టాం.54 మందికి అలాట్ మెంట్ కూడా ఇచ్చాం.₹539 కోట్ల సీజిఎఫ్ నిధులతో దేవాలయాల పునరుద్ధరణ కొత్త వాటిని నిర్మిస్తున్నాం.రాష్ట్రవ్యాప్తంగా 8 దేవాలయాలకు ధూప దీప నైవేద్య పథకం కింద 5000 రూపాయల చొప్పున ఇస్తాం.
అని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు.







