కొత్త కొత్త వాహనాలు కొంటున్న బీఆర్ఎస్ అభ్యర్థులు ! ఒక్కొక్కరు ఎన్నంటే ? 

ఇప్పటికే టిఆర్ఎస్( TRS ) అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రకటన పూర్తి కావడంతో, ఎన్నికల ప్రచారంపైనే అభ్యర్థులు పూర్తిగా దృష్టి సారించారు.తమ నియోజకవర్గాల్లో బలం పెంచుకునేందుకు, ప్రజల్లో తమకే ఆదరణ ఉండే విధంగా చేసుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.

 Brs Candidates Buying New Vehicles! How Much Each, Brs Party, Telangana Governme-TeluguStop.com

దీనిలో భాగంగానే నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని,  ప్రతి గడపను సందర్శించి ప్రజలు మద్దతు కోరే విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. కెసిఆర్ ( KCR )ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితా దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండడంతో , నియోజకవర్గంలో విస్తృతంగా ఉన్న పరిచయాలతో ఎన్నికల ప్రచారంలోకి దిగేందుకు బీ ఆర్ ఎస్ అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.

దీనిలో భాగంగానే  ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్లేందుకు భారీగా వాహనాల కొనుగోలు మొదలు పెట్టారు.కెసిఆర్ ప్రకటించిన 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంపై పూర్తిగా ఫోకస్ పెట్టారు.

Telugu Brs, Brs Mla Candis, Congress, Nomula Bharath, Telangana-Politics

 వీళ్లలో చాలామంది ఎన్నికల ప్రచారం నిమిత్తం భారీగా వాహనాలు కొనుగోలు ప్రక్రియను మొదలుపెట్టారు.ఒక్కో అభ్యర్థి దాదాపు పదికి పైగా వాహనాలను కొనుగోలు సిద్ధమైనట్టు సమాచారం.కొంతమంది అభ్యర్థులు ఇప్పటికే కారులను కొనుగోలు చేసినట్లు సమాచారం.కొంతమంది ఎమ్మెల్యేలు ఫార్చునర్లు, ల్యాండ్ క్రూయిజర్, డిపెండెర్ ( Fortuners, Land Cruiser, Depender )వంటి  వాహనాలను కొనుగోలు చేస్తున్నారు.

 ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలు, మండలాల్లో తమ అనుచర గణంతో కార్లలో వెళ్లి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఇప్పటికే నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భరత్,  తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఖరీదైన వాహనాలను కొన్నట్లు సమాచారం.

Telugu Brs, Brs Mla Candis, Congress, Nomula Bharath, Telangana-Politics

ఇక ఆయా నియోజకవర్గాల్లోని గ్రామాల్లో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హడావుడి మొదలుపెట్టారట.మిగతా అభ్యర్థులు ఇంతే స్థాయిలో భారీగా వాహనాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారట.కొంతమంది అద్దెకు కారు తీసుకుని ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు వాటిని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకోగా , మరి కొంతమంది పార్టీ నుంచి ఏదైనా ఫండ్ వస్తుందని వాటితో కార్లను కొనుగోలు చేయాలని చూస్తున్నారట.కొత్త కొత్త వాహనాలతో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు అభ్యర్థులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉండడంతో,  ఆయా వాహన కంపెనీల ప్రతినిధులు ఎమ్మెల్యే అభ్యర్థుల వద్దకు క్యూ కట్టేస్తున్నాయట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube