టాలీవుడ్ నిర్మాత పవన్ కళ్యాణ్ ను తన గురువుగా చెప్పుకునే బండ్ల గణేష్( Bandla Ganesh ) టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై తాజాగా స్పందించారు.చంద్రబాబు అరెస్టయిన చాలా రోజుల తరువాత ఆలస్యంగా ఈ వ్యవహారంపై స్పందించారు.
ముఖ్యంగా టిడిపి, జనసేన పార్టీల పొత్తు ఖరారైన నేపథ్యంలో పవన్ భక్తుడిగా పేరుపొందిన గణేష్ చంద్రబాబు అంశంపై స్పందిస్తూ .చంద్రబాబు తెలుగుజాతి సంపదని అన్నారు.చంద్రబాబును( Chandrababu Naidu ) కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును జనాలు గెలిపిస్తారని, మళ్లీ టిడిపి అధికారంలోకి వస్తుందని గణేష్ అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో మగ్గుతుంటే తనకు అన్నం కూడా తినబుద్ధి కావడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు అరెస్టు( Chandrababu Arrest ) వ్యవహారాన్ని ఆషామాషీగా వదిలిపెట్టకూడదని, దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేపట్టాలని గణేష్ అభిప్రాయపడ్డారు.
ఐటి ఉద్యోగులు పార్కుల ముందు, రోడ్ల పైన కాదు సొంతోళ్ళకు వెళ్లి అక్కడ ధర్నాలు చేయాలని గణేష్ అన్నారు.

ఐటి ఉద్యోగులు నెలరోజుల పాటు ఉద్యోగాలు మానేసి సొంత వాళ్లకు వెళ్లి ధర్నాలు చేపట్టాలని సూచించారు.ఇదిలా ఉంటే ఇప్పటికే చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై కొన్ని మీడియా ఛానళ్లు గణేష్ తో ఇంటర్వ్యూ తీసుకున్న సందర్భంలో.ఈ అరెస్టు వ్యవహారంపై ప్రశ్నించగా ప్రస్తుతం ఏపీ రాజకీయాలతో తనకు సంబంధం లేదని, తాను తెలంగాణ వాడినని, తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుతానంటూ చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్( Telangana Congress ) అధికారంలోకి వస్తుందంటూ ధీమా వ్యక్తం చేసిన గణేష్ ఏపీ రాజకీయాల్లో కి తనను లాగ వద్దని కోరారు.

అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎప్పుడైతే టిడిపి తో పొత్తు అంశాన్ని ప్రకటించారో ఆ తర్వాత నుంచి గణేష్ వైఖరిలో మార్పు వచ్చినట్టుగా కనిపిస్తోంది.తాజాగా ఆయన చంద్రబాబు వ్యవహారంపై స్పందించడానికి కూడా ఇదే కారణంగా తెలుస్తోంది.ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన కొంతమంది బహిరంగంగా చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై స్పందించగా, ఈ వ్యవహారంలో మరికొంతమంది పరోక్షంగా స్పందిస్తున్నారు.