త్రాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు... -ముస్తఫా నగర్ గ్రామంలో ఖాళీ బిందెలతో నిరసన..

రాజన్న సిరిసిల్ల జిల్లా :గత వారం రోజులుగా మంచినీరు రావడంలేదని గంభీరావుపేట మండలం ముస్తఫా నగర్ ( Mustafa Nagar )గ్రామ మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వారం రోజుల నుండి మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని త్రాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.మిషన్ భగీరథ( Mission Bhagiratha ) నీళ్లు వస్తున్నాయని, గ్రామంలో ఉన్న బోర్లు పాడైన, బాగు చేయించడం లేదని అన్నారు.20 రోజుల నుండి గ్రామంలో చెత్త సేకరణ కూడా చేయడం లేదని ఆరోపించారు.పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడంలేదని అన్నారు.సుమారు అర్ధ గంట పాటు ధర్నా నిర్వహించడంతో, ధర్నా స్థలానికి ఎంపీడీవో శ్రీనివాస్ చేరుకుని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో మహిళల ధర్నాను విరమించారు.

 Women On The Road For Drinking Water -protest With Empty Bins In Mustafa Nagar V-TeluguStop.com

ఈ కార్యక్రమం లో విలేజ్ కమిటీ అధ్యక్షుడు దోమకొండ కృష్ణ కాంత్ యాదవ్, ఉపాధ్యక్షుడు గౌరీగారి నాగరాజు గౌడ్,సభ్యులు శివని దేవేందర్,చిలుక ఎల్లం, ఎండి అక్బర్ ఖాన్, తిరుపతి బాబు, రాజా రమేష్ యాదవ్,మహిళలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube