దేవరకొండ మాజీ లవర్ పాత్రలో ఆ స్టార్ హీరోయిన్.. ఖుషి నుండి మరో సర్ప్రైజ్!

విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) హీరోగా సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ( Samantha ) హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ లవ్ అండ్ ఎమోషనల్ మూవీ ఖుషి ( Khushi ).

శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.

సమంత, విజయ్ కలిసి జంటగా నటిస్తున్న ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది.ఇక ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ఇటీవలే రిలీజ్ చేయగా ఈ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.

మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్( Hesham Abdul ) సంగీతం కంపోజ్ చేసిన ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను అమితంగా ఆకట్టు కుంటుంది.ఫ్రెష్ ఫీల్ తో సాగే ఈ సాంగ్ విజయ్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసారు.

మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది.

Advertisement

ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా నుండి తాజాగా మరో స్పెషల్ అప్డేట్ వచ్చింది.కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ ఉందట.సెకండాఫ్ లో వచ్చే సన్నివేశంలో ఒక పాత్ర ఉందట.

ఆ పాత్రలో ఒక స్టార్ హీరోయిన్ నటిస్తుంది అని తాజాగా సమాచారం అందుతుంది.ఆ పాత్ర దేవరకొండకు మాజీ లవర్ పాత్ర అని తెలుస్తుంది.

అయితే ఈ వార్తపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ ఇదే నిజమైతే విజయ్, సమంత మధ్యలో మరో స్టార్ హీరోయిన్ ఎలా ఉండబోతుందో చూడాలి.ఈ సినిమా కథ ఒక మెచ్యూర్ లవ్ స్టోరీ అని శివ నిర్వాణ ( Shiva Nirvana )సినిమా అంటేనే లవ్ స్టోరీకి పెట్టింది పేరు.అందుకే విజయ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై హోప్స్ పెట్టుకున్నారు.

చూడాలి ఈ ప్రేమ కథ ఎలా ఆకట్టుకుంటుందో.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు