వెండితెరపై నటిగా పలు సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ప్రియమణి (Priyamani) ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఒకానొక సమయంలో హీరోయిన్గా స్టార్ హీరోలు అందరు సరసన నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి విరామం ఇచ్చారు.
అయితే ప్రస్తుతం ఈమె తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరస సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.అంతేకాకుండా బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి పలు కార్యక్రమాలకు ఈమె న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.

ఇలా వెండితెర పైన బుల్లితెర పైన ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె తాజాగా తన పుట్టినరోజు వేడుకలను(Birthday Celebrations) ఎంతో ఘనంగా జరుపుకున్నారు.ఆదివారం (జూన్ 4) ప్రియమణి 38వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటూ 39వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది.ఈ క్రమంలోనే ఈమె పుట్టినరోజు వేడుకలను తన కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఘనంగా జరుపుకున్నారని తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది.అయితే ప్రియమణి పుట్టినరోజు వేడుకలలో భాగంగా తన భర్త మాత్రం కనిపించలేదు.

ప్రియమణి పుట్టినరోజు సందర్భంగా తన భర్త ముస్తఫా రాజ్ (Mustafa Raj)పక్కన లేకపోవడంతో ఈమె తన పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ మిస్ యు ముస్తఫా రాజ్ అంటూ కామెంట్ చేశారు.అయితే ప్రస్తుతం ఈయన పలు వ్యాపారాల నిమిత్తం ఇతర దేశాలలో ఉంటున్న విషయం మనకు తెలిసిందే.అయితే ప్రియమణి సినిమా షూటింగుల పనులలో భాగంగా ఇక్కడే ఉండిపోయారు.ఇక ప్రస్తుతం ఈమె పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.







