ఏపీలో టీవీ5, ఏబీఎన్‌ బ్యాన్‌ విషయమై జగన్‌కు చుక్కెదురు

ఆంధ్రప్రదేశ్‌లో టీవీ5 మరియు ఏబీఎన్‌ ఛానెల్స్‌ అనధికారికంగా బ్యాన్‌ అయిన విషయం తెల్సిందే.కేబుల్‌ ఆరపరేటర్లు ఆ రెండు చానెల్స్‌ను వినియోగదారులకు చూపించడం లేదు.

దాంతో సదరు చానెల్స్‌ రెండు కూడా పలు చోట్ల ఫిర్యాదు చేశాయి.ఎట్టకేలకు ఆ రెండు ఛానెల్స్‌ బాధను టీడీశాట్‌ అర్ధం చేసుకుని విచారణకు ఆదేశించింది.

ఏపీలో నిజంగా ఆ రెండు ఛానెల్స్‌పై అనధికారిక బ్యాన్‌ నడుస్తుందని గ్రహించి వెంటనే రంగంలోకి దిగినట్లుగా సమాచారం అందుతోంది.ఉద్దేశ్య పూర్వకంగా ఆ రెండు ఛానెల్స్‌ను బ్యాన్‌ చేసినందుకు గాను కేబుల్‌ ఆపరేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే ఆ ఛానెల్స్‌ను పునరుద్దరించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు.ప్రసారాలు ప్రారంభించకుంటే ఆ రోజు నుండి రోజుకు రెండు లక్షల చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుందని, లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఈ సందర్బంగా టీడీశాట్‌ ప్రకటించింది.

Advertisement

ఇప్పటి వరకు జరిగిన ఉల్లంఘనకు గాను 15 లక్షల రూపాయలు చెల్లించాలంటూ ఆదేశించింది.

ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 
Advertisement

తాజా వార్తలు