స్నేహితుడిని నమ్మి బైక్ ఇచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న విలేఖరి...

ఒక్కోసారి ఒకరు చేసిన తప్పులకు మరొకరు బలి అవుతుంటారు.ఇందులో కొంతమందైతే తాము చేయని తప్పులకు శిక్షగా ఏకంగా మరణశిక్ష  విధించుకుని తమని తామే శిక్షించుకుంటారు.

సరిగ్గా అలాంటి సంఘటనే క్రిష్ణా జిల్లాలోని తాడేపల్లిలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే స్థానిక పట్టణంలోనీ ముగ్గు రోడ్డు ప్రాంతంలో  చరణ్ రాజు అనే వ్యక్తి నివసిస్తున్నాడు.

ఇతడు ఓ ప్రముఖ ఛానెల్ సంస్థలో విలేకరిగా పనిచేస్తున్నాడు.అయితే ఇతడు ఈనెల 24వ తేదీన విజయవాడలోని ఓ చర్చి కి వెళ్ళాడు.

అయితే ఈ క్రమంలో విజయవాడ లో ఉన్నటువంటి అతని స్నేహితులు శివ మరియు  అతడి స్నేహితుడు చరణ్ రాజు బైక్ ను పని ఉందంటూ తీసుకెళ్లారు.అయితే వీరు విజయవాడలోని వన్ టౌన్ పట్టణ పరిధిలో కి వెళ్లి అక్కడ  ఓ యువతో అసభ్యకరంగా ప్రవర్తించారు.

Advertisement

దీంతో ఆమె దగ్గరలోని పోలీసు స్టేషన్లో పోలీసులను సంప్రదించి ఈ సంఘటనపై ఈవ్ టీజింగ్ కేసు నమోదు చేసింది.విచారణ చేపట్టిన పోలీసులు మోటార్ సైకిల్ నంబర్ ఆధారంగా చరణ్ రాజును అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

అయితే ఈ విచారణలో చరణ్ రాజు నిర్దోషని తేలడంతో అతనిని విడిచిపెట్టారు.దీంతో అకారణంగా తను జైలుకు వెళ్లినందుకుగాను మనస్తాపం చెందిన చరణ్ రాజు తాను ఉంటున్న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

దీంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం ఛాయలు అలుముకున్నాయి.  అనవసరంగా చేయని తప్పుకు పోలీసులు చరణ్ రాజుని అనుమానించారని అందుకే  ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

 అంతేగాక యువతితో అసభ్యకరంగా ప్రవర్తించిన అతడి స్నేహితులపై చర్యలు తీసుకోవాలంటూ బంధువులు వాపోతున్నారు.

అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!
Advertisement

తాజా వార్తలు