టీటీడీ అలర్ట్: ఆ 10 రోజులు వాటికి బ్రేక్..!

తిరుమల అంటే తెలియని వారు ఉండరు.ప్రతి ఒక్కరూ ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామీ దర్శనం కోసం ఎదురుచూస్తూ ఉంటారు.

వేంకటేశ్వరుడు కొలువైన ఏడు కొండలు చాలా ప్రసిద్దమైనది.రోజూ ఇక్కడికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

ప్రస్తుతం కరోనా కారణంగా టీటీడీ కొంత మంది భక్తులను మాత్రమే అనుమతిస్తోంది.శ్రీవారిని దర్శించుకోవాలంటే ఇప్పుడు మూడు మార్గాలు మాత్రమే ఉన్నాయి.

అందులో ఆన్ లైన్లో టోకెన్ విధానం, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా, తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, టీటీడీ పాలకమండలి సభ్యులు, ఛైర్మన్ సిఫార్సులు పొందితేనే తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది.శ్రీవారి దర్శనాలకు ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటుంది.

Advertisement
Ttd Alert Ten Days Break For Vvip Recommended Darshans Details, TTD, Alert, 10 D

ఆన్లైన్ లో టిక్కెట్లు పొందలేని వంద మందిలో 10శాతం మంది శ్రీవాణి వైపు మొగ్గు చూపుతుంటారు.ఆ మిగిలిన 90% మంది సిఫార్సు లేఖలపై దర్శనానికి వెళ్తుంటారు.

సాధారణ రోజుల్లో ఇవ్వన్నీ సజావుగా సాగుతాయి.అయితే ప్రత్యేక పర్వ దినాల్లో మాత్రం టీటీడీ అధికారులు వీటి వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

వైకుంఠ ఏకాదశి నాడు స్వామి వారి దర్శన భాగ్యం కల్పిచాలనే ఒత్తిడి తీవ్రంగా ఉండటంతో చాలా మంది దర్శనానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు.అలాంటి వారిని ఉత్తర ద్వార దర్శనం చేయించేవారు.

Ttd Alert Ten Days Break For Vvip Recommended Darshans Details, Ttd, Alert, 10 D

గతంలో ఉత్తర ద్వారా దర్శనాలు కేవలం రెండు రోజులు మాత్రమే ఉండటం విశేషం.మఠాధిపతులు, పీఠాధిపతుల అనుమతితో 10 రోజుల పాటు ఉత్తరద్వార దర్శనం కల్పించాలని టీటీడీ తెలిపింది.దీంతో గత ఏడాది నుంచి 10 రోజుల పాటు ఉత్తర ద్వారా దర్శన భాగ్యం ఉంది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి30, ఆదివారం 2025

అయితే వీటివల్ల తలనొప్పి ఉండటంతో పదిరోజుల పాటు వీవీఐపీల సిఫార్సు లేఖలను అనుమతించకూడదని టీటీడీ నిర్ణయించింది.ఇది చాలా మందికి షాకింగ్ న్యూసే అయినప్పటికీ అధికారులకు మాత్రం మేలు చేసే విసయం అని చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు