ఖ‌రీదైన క్రీములు అక్క‌ర్లేదు.. ఎండు ద్రాక్ష‌తో ఇలా చేశారంటే మ‌చ్చ‌లేని చ‌ర్మం మీసొంతం!

మచ్చలేని మెరిసే చర్మం( glowing skin ) కోసం ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు.కానీ కొందరు మాత్రమే అటువంటి చర్మం పొందడానికి ప్రయత్నిస్తుంటారు.

ఇందులో భాగంగానే ఖరీదైన క్రీములు మరియు ఇతరేతర చర్మం ఉత్పత్తులను వాడుతుంటారు.అయితే కొన్ని కొన్ని ఇంటి చిట్కాల ద్వారా కూడా అటువంటి చర్మాన్ని పొందవచ్చు.

ముఖ్యంగా అందుకు రెండు ద్రాక్ష ఉత్తమంగా సహాయపడుతుంది.ఎండు ద్రాక్షతో( raisins ) ఇప్పుడు చెప్పబోయే విధంగా చేశారంటే ఎటువంటి ఖరీదైన క్రీములు అక్కర్లేదు.

సహజంగానే స్పాట్ లెస్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను మీ సొంతం చేసుకోవచ్చు.

Advertisement

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పది ఎండు ద్రాక్ష వేసుకోవాలి.అలాగే ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు కాచి చల్లార్చిన పాలు( milk ) వేసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.ఇలా నానబెట్టుకున్న ఎండు ద్రాక్షలను మిక్సీ జార్ లో ప్యూరీ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఎండు ద్రాక్ష ప్యూరీ వేసుకోవాలి.అలాగే మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel ), రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ మరియు చిటికెడు కుంకుమ పువ్వు( Saffron flower ) వేసి బాగా మిక్స్ చేసుకుంటే మంచి ఫేస్ క్రీమ్ రెడీ అవుతుంది.

ఈ క్రిమ్ ను ఫ్రిడ్జ్ లో స్టోర్‌ చేసుకుంటే వారం పది రోజులు పాటు వాడవచ్చు.రోజు నైట్ నిద్రించే ముందు ఈ క్రీం ముఖానికి అప్లై చేసుకుని పడుకోవాలి.

ఎండుద్రాక్షలో విటమిన్ సి, విటమిన్ ఇ( Vitamin C, Vitamin E ) మరియు బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.ఈ యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి.మ‌రియు మొండ మ‌చ్చ‌ల‌కు వ్య‌తిరేకంగా పోరాడ‌తాయి.

ఆ సినిమాలో 100 మందితో ఫైట్ సీన్.. ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ సీన్ ఇదేనంటూ?
ఒకరోజు ముందుగానే పుష్ప2 విడుదల.. సంతోషంలో ఫ్యాన్స్!

ఎలాంటి మ‌చ్చ‌లనైనా క్ర‌మ‌క్ర‌మంగా మాయం చేస్తాయి.అలాగే ఆలోవెర జెల్‌, పాలు మ‌రియు విట‌మిన్ ఈ ఆయిల్ చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి.

Advertisement

ఆరోగ్యకరమైన ఛాయను ప్రోత్సహిస్తాయి.అకాల వృద్ధాప్యానికి చెక్ పెడ‌తాయి.

ఇక కుంకుమ పువ్వు స్కిన్ బ్రైటెనింగ్ కు తోడ్ప‌డుతుంది.పిగ్మెంటేషన్ స‌మ‌స్య‌ను దూరం చేస్తుంది.

సన్ డ్యామేజ్ నుంచి సైతం ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది.

తాజా వార్తలు