పైసా ఖర్చు లేకుండా ఫేషియల్ గ్లో పొందాలనుకుంటున్నారా.. అయితే ఈ రెమెడీ మీకోసం!

ముఖ చర్మాన్ని అందంగా మ‌రియు కాంతివంతంగా మెరిపించుకోవడం కోసం చాలా మంది నెలకు ఒకటి లేదా రెండు సార్లు ఫేషియల్ చేయించుకుంటూ ఉంటారు.

ఇందుకోసం వేలకు వేలు ఖర్చు పెడతారు.

కానీ కొంద‌రు పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే సులభంగా ఫేషియల్ గ్లో ను పొందాలని అనుకుంటూ ఉంటారు.? అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా బాగా హెల్ప్ అవుతుంది.ఈ రెమెడీని పాటిస్తే సహజంగానే అందంగా మెరిసిపోతారు.

అందుకోసం ముందుగా గ్రీన్ టీ ను తయారు చేసుకొని చల్లార బెట్టుకోవాలి. గ్రీన్ టీ( Green Tea ) శ‌రీర బ‌రువును త‌గ్గించ‌డానికి, వివిధ జ‌బ్బుల నుంచి ర‌క్షించ‌డానికి మాత్రమే కాదు చర్మ ఆరోగ్యానికి మద్దతు ఇచ్చి అందాన్ని పెంచడానికి కూడా తోడ్పడుతుంది.

గ్రీన్ టీ తయారు చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి.

Advertisement

అలాగే వన్ టేబుల్ స్పూన్ తేనె మరియు సరిపడా గ్రీన్ టీ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఆరబెట్టుకోవాలి.కొంచెం తడిపొడిగా ఉన్నప్పుడే ముని వేళ్ళతో చర్మాన్ని స్క్రబ్బింగ్ చేసుకుంటూ కూల్ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

వారానికి రెండు సార్లు ఈ సింపుల్ రెమెడీని కనుక పాటించారంటే ఖర్చు లేకుండా ఫేషియల్ గ్లో ను పొందుతారు.ఈ రెమెడీ డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.చర్మ కణాలను లోతుగా శుభ్రం చేస్తుంది.

టాన్ ను రిమూవ్ చేస్తుంది.చర్మానికి కొత్త మెరుపును జోడిస్తుంది.

చర్మం అందంగా కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల చర్మం పై అధిక ఆయిల్ ఉత్ప‌త్తి కంట్రోల్ అవుతుంది.

అమ్మతోడు ఆస్తి కోసం కాదు.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు నెట్టింట వైరల్!
జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?

మొటిమల సమస్య( Acne problem ) సైతం తగ్గు ముఖం పడుతుంది.

Advertisement

తాజా వార్తలు