స్పాట్ లెస్ అండ్ ఈవెన్ స్కిన్ టోన్ కోసం ఈ ఫ్రూట్ మాస్క్ ను ప్రయత్నించండి!

చర్మంపై ముదురు రంగు ప్యాచెస్ కారణంగా కొందరి స్కిన్ టోన్( Skin tone ) అనేది అన్ ఈవెన్ గా కనిపిస్తుంటుంది.

అందుకు తోడు చర్మంపై నల్లటి మచ్చలు అందాన్ని మరింత పాడు చేస్తాయి.

ఈ క్రమంలోనే స్పాట్ లెస్ అండ్ ఈవెన్ స్కిన్ టోన్ కోసం రకరకాల చర్మ ఉత్పత్తులను వాడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే ఫ్రూట్ మాస్క్ ను తప్పకుండా ప్రయత్నించండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు బాదం గింజలు( Almonds ) మరియు హాట్ వాటర్ పోసి గంట పాటు నానబెట్టుకోవాలి.

మరొక గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ ఓట్స్‌ ( Oats )మరియు కొద్దిగా వాటర్ పోసి నానబెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న ఓట్స్, పొట్టు తొలగించిన బాదం గింజలు వేసుకోవాలి.

అలాగే నాలుగు పీల్ తొలగించిన కివి పండు స్లైసెస్ వేసుకుని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ పెరుగు, వన్ టేబుల్ స్పూన్ తేనె( honey ) వేసుకుని మిక్స్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ విధంగా కివి ఫ్రూట్ మాస్క్ ను కనుక వేసుకుంటే చర్మంపై మొండి మచ్చలన్నీ మాయమవుతాయి.

ముదురు రంగు ప్యాచెస్ తగ్గుముఖం పడతాయి.స్కిన్ టోన్ ఈవెన్ గా మారుతుంది.అలాగే కివి పండులో ఉండే విటమిన్ సి కంటెంట్ ఆరోగ్యకరమైన చ‌ర్మాన్ని ప్రోత్స‌హిస్తుంది.

స్కిన్ టోన్ ను పెంచుతుంది.

కివి పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్లు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి.స్కిన్ ఏజింగ్ ను ఆల‌స్యం చేస్తాయి.కివి యొక్క విటమిన్ ఎ సెబమ్ ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

జనాలను పిచ్చోళ్లను చేయొద్దు.. అలియా భట్ పై ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు!
తండ్రి కారణంగా వరలక్ష్మి ఎన్ని గొప్ప సినిమాలు కోల్పోయిందో తెలుసా ?

ఇది జిడ్డుగల చర్మం ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.సో స్పాట్ లెస్ అండ్ ఈవెన్ స్కిన్ టోన్ కోసం ఆరాట‌ప‌డుతున్న‌వారు త‌ప్ప‌కుండా కివితో పైన చెప్పిన విధంగా ఫ్రూట్ మాస్క్ వేసుకునేందుకు ప్రయ‌త్నించండి.

Advertisement

తాజా వార్తలు