ట్రంప్ కీలక నిర్ణయం...ఇక దబిడ..దిబిడే...!!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘోరమైన ఓటమి చవిచూసిన తరువాత డోనాల్డ్ ట్రంప్ ఓటమి భారంతో వైట్ హౌస్ విడిచి సొంత ప్రాంతానికి వెళ్ళిపోయారు.

కనీసం నూతన అధ్యక్షుడు బిడెన్ ప్రమాణ స్వీకారానికి కూడా హాజరు కాకుండానే వెళ్ళిపోయారు ట్రంప్.

కొంత కాలంగా తన బిజినెస్ వ్యవహారాలలో బిజీ బిజీగా గడిపిన ట్రంప్, కాస్త విరామం తరువాత మళ్ళీ ఎంటర్ ది డ్రాగన్ అంటూ యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చేస్తున్నారు.అమెరికాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, పలు కీలక అంశాలపై త్వరలో ప్రసంగించనున్నారట.

బిడెన్ అధికారంలోకి వచ్చిన తరువాత వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.ముఖ్యంగా ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను ఒక్కొక్కటిగా రద్దు చేస్తున్నారు.

కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి వ్యాక్సిన్ ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేలా ,ఉత్పత్తులు పెంచేలా చర్యలు చేపట్టారు.వలస వాసులపై ట్రంప్ ఝులిపించిన కోరడాను వెనక్కి తీసుకున్నారు, అంతేకాదు వలస వాసులు దేశానికి ఎంతో అవసరమని, పౌరసత్వానికి సంభందించిన బిల్లుపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు.

Advertisement

అలాగే సరిహద్దు గోడ కు కేటాయించిన నిధులను రద్దు చేశారు.దాంతో ఈ పరిణామాలపై ట్రంప్ మండిపడుతున్న ట్రంప్ ఈ నెల 28 వ తేదీన ఫ్లోరిడాలో కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ ర్యాలీ లో పాల్గొననున్నారు.

ఈ ర్యాలీలో నిర్వహించే సభలో ట్రంప్ భవిష్యత్త్ కార్యాచరణ పై కీలక నిర్ణయం తీసుకోనున్నారట.రిపబ్లికన్ పార్టీ బిడెన్ పాలనా వ్యవహారాలపై ఎలా స్పందించాలి అనే విషయాలపై చర్చించనున్నారట.

ముఖ్యంగా అమెరికన్స్ ప్రయోజనాల కోసం వలస వాసులపై విధించిన ఆంక్షలు ఎత్తివేయడం సరికాదంటూ ఆ అంశాన్నే ప్రధాన ఎజెండాగా తీసుకుని కీలక వ్యాఖ్యలు చేయనున్నారని స్థానిక మీడియా తెలిపింది.ఇకపై బిడెన్ తీసుకునే నిర్ణయాలను నిశితంగా పరిశీలిస్తూ సదరు నిర్ణయాలపై నిరసనలు తెలిపే విధంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లనున్నారట.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు