మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం

మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయదుంధుభి మోగించింది.బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు.

సుమారు 10 వేల 297 ఓట్ల మెజార్టీతో గులాబీ జెండాను ఎగురవేశారు.రెండు రౌండ్లు మినహా ప్రతి రౌండ్ లోనూ టీఆర్ఎస్ ఆధిక్యతను చాటుకుంది.వామపక్షాలతో పొత్తు టీఆర్ఎస్ కు కలిసొచ్చిందని చెప్పొచ్చు.7 మండలాల్లో టీఆర్ఎస్ దే పూర్తి అధిపత్యం.మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిపాజిట్ కోల్పోయారు.సిట్టింగ్ స్థానాన్ని కూడా కోల్పోవడం గమనార్హం.14 రౌండ్ల అనంతరం కూసుకుంట ప్రభాకర్ రెడ్డికి 95,304 ఓట్లు రాగా, రాజగోపాల్ రెడ్డికి 85,157 ఓట్లు లభించాయి.మూడోస్థానంలో ఉన్న పాల్వాయి స్రవంతి 21,243 ఓట్లతో సరిపెట్టుకున్నారు.

ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత కేవలం 2, 3వ రౌండ్ లోనే బీజేపీకి మొగ్గు కనిపించింది.అది మినహా ప్రతి రౌండ్ లోనూ టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యంతో ముందంజ వేసింది.

మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడంతో గులాబీ శ్రేణుల సంబురాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.ఇప్పటికే తెలంగాణభవన్ లో పార్టీ నేతలు, కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు.

Advertisement

బాణసంచా కాల్చి, స్వీట్స్ పంచుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కాగా ఇప్పటికే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమిని అంగీకరించారు.

కానీ మునుగోడులో నైతిక విజయం బీజేపీదేనని చెప్పారు.టీఆర్ఎస్ బెదిరింపులకు పాల్పడి గెలిచిందని ఆరోపణలు చేశారు.

ఏదేమైనా ప్రజా తీర్పును గౌరవిస్తామని తెలిపారు.

త్రివిక్రమ్ సునీల్ 30 రూపాయల అనుభవం తెలుసా.. ఇన్ని కష్టాలు అనుభవించారా?
Advertisement

తాజా వార్తలు