టార్గెట్ 60 కి 60.. ఖమ్మంలో TRS సూపర్ ప్లాన్..!

త్వరలో జరగబోతున్న ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల్లో కొత్తగా 60 డివిజన్లలో ఎలక్షన్స్ నిర్వహించనున్నారు.

ఈ ఎలక్షన్స్ లో ఎలాగైనా పార్టీని గెలిపించాలని అధికార పార్టీ ప్లాన్స్ వేస్తుంది.

ఇతర పార్టీల్లో ఉన్న ఆహావహులను టార్గెట్ చేస్తుంది.ఖమ్మంలో 60 కి 60 టీ.ఆర్.ఎస్ గెలిచితీరాల్సిందే అనేలా కాంపెయినింగ్ మొదలు పెట్టబోతున్నారు.నోటిఫికేషన్ కూడా వస్తున్న ఈ టైం లో ఖమ్మంలో కార్పొరేషన్ ఎలక్షన్స్ హడావిడి మొదలు కాబోతుంది.

టార్గెట్ 60 కి 60.. ఖమ్మంలో TRS సూపర�

ముఖ్యంగా అధికార పార్టీ మిగతా పార్టీలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా క్లీన్ స్వీప్ పై ఫోకస్ పెట్టింది.కార్పోరేషన్ ఎన్నికల షెడ్యూల్ కన్ఫాం అవకుండానే ఆయా పార్టీకి చెందిన నాయకులు పార్టీలు మారేందుకు సిద్ధమవుతున్నారు.

ఉన్న పార్టీలో అసంతృప్తితో ఉన్న వాళ్లు అధికార పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు.ఇప్పటికే టీ.ఆర్.ఎస్ లో చేరే వారి జాబితా రెడీ అవుతుంది.టీ.డీ.పీ, కాంగ్రెస్ నాయకులను టీ.ఆర్.ఎస్ లోకి ఆహ్వానిస్తున్నారు.గతంలో టీ.డీ.పీ నుండి వార్డ్ సభ్యుడిగా గెలిచిన చిరుమామిళ్ల నాగేశ్వర రావు, ఎలినేని రమణ టీ.డీ.పీకి గుడ్ బై చెప్పి మంత్రి పువ్వాడ సమక్షలో టీ.ఆర్.ఎస్ కండువా కప్పుకున్నారు.కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు బండి మణి, మాజీ సర్పంచ్ భూక్యా భాషాతో పాటు మైనారిటీ నాయకులు గులాబీ పార్టీలో చేరారు.

Advertisement

టీ.ఆర్.ఎస్ నుండి అభ్యర్ధుల జాబితా ప్రకటించగా అక్కడ అవకాశం దక్కని వారు బీ.జే.పీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు.నోటిఫికేషన్ వచ్చాక ఫార్ములాలు మారే అవకాశం ఉంది.

ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. పైచేయి సాధించిన అమ్మాయిలు..!
Advertisement

తాజా వార్తలు