ఈటెలపై ముప్పేట దాడికి టీఆర్ఎస్ రెడీ...ఫైనల్ టచ్ ఇదే?

టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఈటెలను భర్తరఫ్ చేసిన తరువాత ఈటెలను రాజకీయంగా ఒంటరి చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది.

ఇప్పటికే అవినీతిపరుడిగా ముద్ర వేసి రాజకీయంగా ఈటెలను అభాసుపాలు చేద్దామని టీఆర్ఎస్ వ్యూహం బెడిసికొట్టిన విషయం తెలిసిందే.

అయితే ఆ తరువాత హుజురాబాద్ లో టీఆర్ఎస్ నాయకులను ఈటెల వైపు వెళ్లకుండా అడ్డుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ ను బరిలోకి దింపినా వంద శాతం సక్సెస్ కావడం లేదు.అయితే ఇక హరీష్ ని బరిలోకి దింపి హరీష్ వ్యూహాలతో ఈటెలకు పూర్తి స్థాయి చెక్ పెట్టే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం.

TRS Ready For Thirty Attacks On Etela Rajender Is This The Final Touch Kcr, Etel

అంతా సర్దుకున్నాక అక్కడ కెప్టెన్ లక్ష్మీ కాంతారావు అన్న కొడుకు భరత్ రెడ్డిని ఫోకస్ చేసేందుకు ఒక భారీ సభ నిర్వహించి ఒక్కసారిగా హుజూరాబాద్ ఫేస్ భరత్ రెడ్డి అనే విధంగా వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఇక అప్పటి వరకు కార్యకర్తలను సమన్వయ పరుస్తూ టీఆర్ఎస్ లో ఉంటే భవిష్యత్తులో మంచి అవకాశం కల్పిస్తామని హరీష్ తరహా భరోసా ఇచ్చే అవకాశం ఉంది.

ఇక అప్పటి వరకు ఈటెలను మానసికంగా బలహీనపరిచి, ముప్పేట దాడిని చేస్తూ, ఈటెలను రాజకీయ నిరుద్యోగిగా మార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ, చివరిగా భరత్ రెడ్డిని గ్రాండ్ లాంచ్ అనేది హరీష్ వ్యూహంలా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

తాజా వార్తలు