జగన్‌ ప్రకటనతో టీఆర్‌ఎస్‌ నేతలు ఎలా ఎగిరి గంతేస్తున్నారో చూడండి!

కేసీఆర్‌తో జగన్‌కు మెల్లగా వైరం పెరుగుతోందని రాజకీయ విశ్లేషణలు ఎన్ని ఉన్నా.పరోక్షంగా ఆయనకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి.

తాజాగా ఏపీకి మూడు రాజధానులని అసెంబ్లీలోనే జగన్‌ ప్రకటించారు.రాజధాని స్పష్టత ఇచ్చానని అనుకుంటున్నా అని చివర్లో జగన్‌ చెప్పడం చూస్తుంటే.

ఇక ఆంధ్రప్రదేశ్‌కు అమరావతితోపాటు విశాఖ, కర్నూలు కూడా రాజధానులుగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.సాక్షాత్తూ ముఖ్యమంత్రే రాజధానిపై స్పష్టత ఇవ్వడంతో ఇన్నాళ్లూ వేచి చూసే ధోరణిలో ఉన్న పెట్టుబడులు కూడా అమరావతి నుంచి హైదరాబాద్‌ వైపు మళ్లనున్నట్లు వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

జగన్‌ ప్రకటనకు హైదరాబాద్‌కు ఎంతగానో మేలు చేసేదే అని టీఆరెస్‌ నేతలు కూడా సంబర పడుతున్నారు.బయటి పెట్టుబడులే కాదు.

Advertisement

సీమాంధ్ర వ్యాపారులు కూడా మళ్లీ భాగ్యనగరం వైపే చూస్తారని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత కొన్నాళ్ల పాటు హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం స్తబ్ధుగా మారింది.ఇంతకుముందు ఏపీలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామంటూ రాజధాని కోసం భారీ ప్రణాళిక సిద్ధం చేసి హైదరాబాద్‌కు రావాల్సిన పెట్టుబడులను కూడా ఏపీకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.అయితే అక్కడ ప్రభుత్వం మారిన తర్వాత అమరావతిలో నిర్మాణాలు ఆగిపోయాయి.

దీంతో మెల్లగా ఒక్కో సంస్థ అక్కడ పెట్టుబడులు ఉపసంహరించుకుంటూ వస్తోంది.అదానీతోపాటు దుబాయ్‌కు చెందిన లులు గ్రూప్‌ కూడా ఏపీ నుంచి తరలిపోయాయి.

ఇక ఇప్పుడు జగన్‌ ప్రకటనతో రాజధానిపై స్పష్టత వచ్చేసింది.మూడు రాజధానులను నమ్ముకోవడం కంటే హైదరాబాదే ఎంతో మేలని పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
మూసీ యుద్ధం..  రేవంత్ వర్సెస్ ఈటెల 

టీఆరెస్‌ నేతలే కాదు.తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కూడా ఇది హైదరాబాద్‌కు మేలు చేసే నిర్ణయమే అని అంచనా వేస్తున్నారు.హైదరాబాద్‌లో ఆస్తుల కొనుగోలు పెరుగుతుందని, దీనివల్ల వాటికి మరింత డిమాండ్‌ పెరిగి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం భారీగా వృద్ధి చెందుతుందని మార్కెట్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

రాజకీయ నేతలే కాదు.క్రెడాయ్‌ (కాన్ఫెడరేషన్ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా) ప్రతినిధులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అమరావతిలో ఇప్పటికే పెట్టుబడి పెట్టిన వాళ్లు దారుణంగా దెబ్బతిన్నారని, ఇప్పటికే కొంతమంది హైదరాబాద్‌కు వచ్చేయగా తాజా ప్రకటనతో మరింత మంది భాగ్యనగరం బాట పట్టడం ఖాయమని వాళ్లు అంచనా వేస్తున్నారు.

తాజా వార్తలు