సైనసైటిస్ తో ఇబ్బంది పడుతున్నారా..?! అయితే వంటింటి చిట్కాలు ఫాలో అవ్వండి..!

ఈ కాలంలో చాలామంది ఎదుర్కునే సమస్యల్లో సైనసైటిస్ కూడా ఒకటి అని చెప్పాలి.సైనసైటిస్ సమస్యతో బాధపడే వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు.

ఎన్ని మెడిసిన్స్ ట్రై చేసినాగాని ఆశించినంత ఫలితం కనిపించదు.సీజన్ తో సంబంధం లేకుండా మాటిమాటికి జలుబు చేస్తూ ఉంటే అది సైనసైటిస్ అని గుర్తించండి.

కొంతమందికి వాతావరణం చల్లబడిందంటే చాలు తుమ్ములు, దగ్గులు మొదలవుతాయి.మరికొందరికి చల్లటి వాతావరణం లేకపోయినా పదే పదే జలుబు చేస్తూ ఉంటుంది.

దీనికి కారణం అలర్జీ.జలుబు అయితే ఐయిదారు రోజుల్లో తగ్గిపోతుంది.

Advertisement

జలుబుతో పాటు సైనస్ లు ఉన్న భాగాల్లో నొప్పితో పాటు, తలనొప్పిగా కూడా ఉంటే అది సైనసైటిస్ అని భావించి డాక్టర్ ను సంప్రదించండి.ఎన్ని మందులు వాడిన ఫలితం కనిపించని వారికి ఆయుర్వేదంలో సైనస్ ను తగ్గించే కొన్ని అద్భుతమైన చిట్కాలు కలవు.

మరి ఆ చిట్కాల గురించి తెలుసుకుందామా.

ముందుగా సైనస్ సమస్య నుండి ఉపసమనం పొందడానికి మందు ఎలా తయారు చేయాలో చూద్దాం.ముందుగా కావలిసిన పదార్ధాలు ఏంటో చూద్దామా.మిరియాలు – 100 గ్రాములు, అభ్రకభస్మం – 5 గ్రాములు.

, పటిక బస్మం – 5 గ్రాములు, రుమి మస్తకి – 100 గ్రాములు, సొంటి – 100 గ్రాములు, పిప్పళ్ళు – 100 గ్రాములు, కాంచనార గుగ్గుల్లు – 100 గ్రాములు, త్రిఫల – 100 గ్రాములు, వెలిగారం – 5 గ్రాములు, అడ్డాసరం – 100 గ్రాములు వీటన్నిటినీ తయారు చేయు విధానం చూస్తే.ముందుగా పైన చెప్పిన పదార్ధాలను అన్నిటిని తీసుకుని శుభ్రం చేసుకుని, ఆరపెట్టుకుని బాగా వేయించి మెత్తని పొడిలా చేసుకొవాలి.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
గ్రహశకలాన్ని గుర్తించి అరుదైన ఘనత సాధించిన విద్యార్థి

ఇప్పుడు ఒక అరచెంచా పొడిని గోరు వెచ్చటి నీటిలో కలుపుకోవాలి.అలాగే అందులో ప్రకృతి సిద్ధంగా లభించే తేనెను కూడా కలిపి ప్రతి రోజూ ఉదయం, రాత్రి గోరువెచ్చటి నీటిలో వేసుకుని తాగాలి.

Advertisement

అలాకాకుండా పాలలో అయిన వేసుకుని తాగవచ్చు.పెద్దవాళ్ళకి అయితే అర చెంచా పొడి వేయాలి.

అదే చిన్నపిల్లలకు అయితే పావు చెంచా పొడి వేస్తే సరిపోతుంది.ఈ మందు సైనస్ సమస్యతో బాధపడే వారికి మంచి ఉపశమనం ఇస్తుంది.

అలాగే మరొక చిట్కా కూడా చూద్దాం.ఉత్తరేణి అనే ఆకులను తీసుకొని బాగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసి ఆ ఆకులలోంచి రసం తీసుకోవాలి.

ఆ ఆకుల రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో 100 గ్రా.వేప నూనెను స్టవ్ మీద పెట్టి సన్నని మంట మీద మరగనివ్వాలి.

చివరకు నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించాలి.ఈ ఉత్తరేణి నూనెను ఒక ఒక సీసాలో పోసుకుని భద్రపరుచుకోవాలి.

ఈ ఉత్తరేణి తైలంను రోజుకు రెండు చుక్కలు చొప్పున నాసికా రంద్రాల్లో అంటే ముక్కు రంధ్రాల్లో వేసుకుంటే ముక్కు లోపల కండని పెరగనివ్వకుండా చెస్తుంది.దీనితో మీకు సైనసైటిస్ సమస్య తగ్గుతుంది.

తాజా వార్తలు