భార్య చేతిలో మోసపోయిన టాలీవుడ్ విలన్ సాయి కుమార్..!

డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు సాయికుమార్ సింహ సినిమాలో విలన్ గా నటించి బాగా క్రేజ్ తెచ్చుకున్నారు.

సాయి కుమార్ ప్రధానంగా మలయాళ చిత్రాల్లో నటిస్తారు.

ఆయన మలయాళ నటుడైన కొట్టారక్కర శ్రీధరన్ నాయర్ కి జన్మించారు.సాయికుమార్ తండ్రి శ్రీధరన్ 150 మలయాళ సినిమాల్లో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్నారు.

ప్రముఖ నటి శోభ మోహన్ సాయి కుమార్ కి అక్క కాగా.విను మోహన్ అల్లుడు అవుతాడు.

ఇలా చూసుకుంటే సాయికుమార్ కుటుంబం నుంచి మొత్తం నలుగురు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు అని చెప్పుకోవచ్చు.సాయి కుమార్ 1977 లో విడుదలయిన విదరుణ మోత్తుకల్ మూవీ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండి తెరకు పరిచయం అయ్యారు.మొదటిగా కమెడియన్ గా నటించిన ఆయన ఆ తర్వాత మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు.2007లో విడుదలైన ఆనందభైరవి మూవీలో సాయికుమార్ కనబరిచిన నటనకు విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు.ఈ మూవీలో బ్రహ్మాండంగా నటించినందుకు గాను ఆయనకు ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు దక్కింది.

Advertisement
Tollywood Villain Sai Kumar Cheated By His Own Wife, Tollywood Villain Sai Kumar

ఇంకా ఎన్నో సినిమాల్లో తన అద్భుతమైన నటనా ప్రదర్శన చూపించి ప్రేక్షకుల మనసులను చూరగొన్నారు.అయితే సాయి కుమార్ మూవీ కెరీర్ సాఫీ గానే కొనసాగింది కానీ ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం ముళ్ళ మీద నడకే అయింది.

Tollywood Villain Sai Kumar Cheated By His Own Wife, Tollywood Villain Sai Kumar

సాయి కుమార్ డ్రామా ట్రూప్ లో చేరి నాటకాలు వేస్తున్న సమయంలో ఆయనకి ప్రసన్నకుమారి తో పరిచయం ఏర్పడింది.వీళ్లిద్దరూ కలిసి అనేక నాటకాల్లో హీరోహీరోయిన్లుగా నటించారు.అయితే వీరి మధ్య పరిచయం ప్రేమకు, ఆపై పెళ్ళికి కూడా దారి తీసింది.

అయితే పెళ్లి చేసుకున్న అనంతరం కొంతకాలం పాటు ప్రసన్నకుమారి, సాయికుమార్ ఎంతో అన్యోన్యంగా తమ వైవాహిక జీవితాన్ని కొనసాగించారు.ఈ దంపతులకు వైష్ణవి అనే కూతురు కూడా జన్మించింది.

దీంతో ప్రసన్నకుమారి సినిమాలు మానేసి తన కూతురు ఆలనాపాలనా చూసుకోవడం ప్రారంభించారు.అయితే ఒకరోజు ఉన్నఫలంగా తన భార్య తనని మోసం చేసిందని మండిపడి కొచ్చి లోని ఒక అపార్ట్మెంట్ తీసుకొని సెపరేట్ గా జీవించడం ప్రారంభించారు.

Tollywood Villain Sai Kumar Cheated By His Own Wife, Tollywood Villain Sai Kumar
చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

ప్రసన్నకుమారి వయసులో సాయి కుమార్ కంటే ఆరేళ్ళు పెద్దది అట.అయితే ఆ విషయం తెలిసిన సాయికుమార్ తీవ్ర నిరాశకు లోనయ్యారట.వయస్సు విషయంలోనే వారిద్దరి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయట.

Advertisement

అయితే ప్రసన్నకుమారి మాత్రం తన భర్త సాయి కుమార్ బిందు పనికిర్ అనే ఒక లేడీ కమెడియన్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నారని తనని తన కూతురిని పట్టించుకోవడంలేదని చెప్పుకొచ్చారు.ఈ విషయంలో వీళ్ళిద్దరికీ ఎన్నో గొడవలు అయ్యాయి.

చివరికి సాయికుమార్ తన భార్యతో విడాకులు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు.దీంతో 2008లో కోర్టు సాయి కుమార్ మరియు ప్రసన్న కుమారి దంపతులకు విడాకులు మంజూరు చేసింది.2009వ సంవత్సరంలో సాయికుమార్ మలయాళీ కమెడియన్ బిందు పనికిర్ ను పెళ్లి చేసుకున్నారు.

తాజా వార్తలు