బిగ్ బాస్ లోకి ఆ స్టార్ కపుల్ ఎంట్రీ

బిగ్ బాస్ సీజన్ 3 మీద తెలుగు నాట అప్పుడే ఆసక్తి మొదలైంది.

ఈ సీజన్ కి ఊహించని విధంగా కింగ్ నాగార్జున వ్యాఖ్యతగా రావడం ఇప్పుడు మరో సారి బిగ్ బాస్ ఎలా నడవబోతుంది అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఇక ఈ సారి కాస్తా పేరున్న స్టార్స్ ని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావాలని నిర్వాహకులు సైతం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళబోతున్నారు అని చాలా మంది స్టార్స్ పేర్లు వినిపించాయి.

అయితే వారిలో ఎంత మంది లోపకికి వెళ్తారు అనే విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ కపుల్ అయిన వరుణ్ సందేశ్, వితిక షేరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సినిమాలో కలిసి నటించి, తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఇక పెళ్లి తర్వాత పెద్దగా సినిమా అవకాశాలు లేకపోవడంతో వరుణ్ సందేశ్ సొంత వ్యాపారాలతో పాటు, అప్పుడప్పుడు వెబ్ సిరిస్ లు చేస్తున్నాడు.

Advertisement

ఈ నేపధ్యంలో ఈ ఇద్దరిని హౌస్ లోకి తీసుకొస్తే కావాల్సినంత రొమాన్స్ ఉండే అవకాశాలు ఉన్నయాని నిర్వాహకులు భావించి వీరిని ఒప్పించినట్లు టాక్ వినిపిస్తుంది.ఇక హాట్ యాంకర్ శ్రీముఖి కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందని టాక్ వినిపిస్తుంది.

మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే బిగ్ బాస్ ఆరంభం అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు