సినిమాలో డైలాగ్ కి మంచు లక్ష్మి మీద ఫైర్ అవుతున్న మహిళా సంఘాలు

మంచు ఫ్యామిలీ అంటే ఎప్పుడు వివాదాలకి కేరాఫ్ అడ్రెస్స్ గా ఉంటారు.ఏదో ఒక వివాదం వారి కేంద్రంగా అటు రాజకీయాలలో గాని, ఇటు సినిమా ఇండస్ట్రీలో గాని తిరుగుతూ ఉంటుంది.

 Women Activists Serious On Manc Obaby Moviehu Lakshmi Obaby Movie Dialogue-TeluguStop.com

అలాగే సంచలనాలకి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి మంచు ఫ్యామిలీ సెంటర్ గా ఉంటుంది.అప్పట్లో మంచు మోహన్ బాబు ఓ ఇంగ్లీష్ చానల్ ఇంటర్వ్యూలో వాడిన ఫసక్ అనే పధం ఎంతగా ఫేమస్ అయ్యిందో అందరికి తెలిసిందే.

ఇలా ఎప్పుడు తెలియకుండానే సెన్సేషన్ అయ్యే మంచు ఫ్యామిలీకి ఇప్పుడు మరో కొత్త వివాదం చుట్టుకుంది.అది కూడా మంచు లక్ష్మి మెడకి ఆ వివాదం చుట్టుకుంది.

తాజాగా సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓ బేబీ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో మంచు లక్ష్మి కనిపిస్తుంది.ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మంచు లక్ష్మి పాల్గొని సినిమాలో ఉన్న డైలాగ్ ని ప్రేక్షకులకు చెప్పి ఉత్సాహపరించింది.

ఇప్పుడు అదే ఆమెను వివాదంలోకి నెట్టింది.ఓ బేబీ ట్రైల‌ర్లో నీకు ఎలాంటి మొగుడు కావాలంటే అందంగా ఉండాలి, డ‌బ్బులుండాలి, మంచ‌మెక్కితే మ‌గాడిలా కాపురం చేయాలి అనే డైలాగ్ ఉంటుంది.

ఈ డైలాగ్ మంచు లక్ష్మి ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెప్పింది.దీనిపైన మహిళా సంఘాలు ఇప్పుడు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాయి.వెంటనే ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.మరి ఈ వివాదం ఎంత వరకు వెళ్తుంది అనేది వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube