ఆ సీనియర్ నటులను రీప్లేస్ చేస్తున్న కొత్త నటులు...

సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు ప్రస్తుతం ఎక్కువ సినిమాల్లో నటించలేకపోతున్నారు కారణం ఏంటి అంటే కొత్త నటులు వచ్చి వాళ్ళకున్న అవకాశాలని లాక్కెళ్ళిపోతున్నారు.

దాంతో సీనియర్ నటులు అయిన కొంతమందికి నటులకి అవకాశాలు అంతగా రావడం లేదు ఆ నటులు ఎవరు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం.

ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్ది మంది మంచి నటుల్లో నటులలో రావు రమేష్( Rao Ramesh ) ఒకరు.ఈయన అప్పట్లో అత్యంత కీలకమైన నటుడు గా ఉండేవాడు.

ప్రతి సినిమాలో ఆయన ఒక మంచి క్యారెక్టర్ ని పోషిస్తూ తనకంటూ డిఫరెంట్ మాడ్యులేషన్స్ తో నటించి మెప్పించేవాడు.కానీ ప్రస్తుతం ఉన్న టైంలో ఆయనకు రీప్లేస్ గా చాలామంది కొత్త నటులు వచ్చారు.

దాని వల్ల ఆయనకి ఎక్కువగా అవకాశాలు రావడం లేదనే చెప్పాలి.

Advertisement

రావు రమేష్ కి రీప్లేస్ గా వచ్చిన నటులు ఎవరు అంటే శ్రీకాంత్ అయ్యంగర్( Srikanth Iyengar ) ఒకరు.ఈయన ప్రస్తుతం చేస్తున్న చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ తనకంటూ ఒక మంచి ఇమేజ్ ని సంపాదించుకున్నాడు.ఆయన తర్వాత ఆ ప్లేస్ ని ఆక్యుపై చేస్తున్న నటులలో అజయ్ గోష్( Ajay Ghosh ) ఒకరు.

ఈయన కూడా ఈ మధ్య చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మంచి పేరు అయితే సంపాదించుకుంటున్నాడు.

రావు రమేష్ లాగే ముందు చాలా సినిమాల్లో కమెడియన్ గా మంచి క్యారెక్టర్లను పోషించిన శ్రీనివాసరెడ్డి( Srinivas Reddy ) కూడా ప్రస్తుతం ఎక్కువ అవకాశాలను పొందలేకపోతున్నాడు.ఎందుకు అంటే ఈయనకు రీప్లేస్ మెంట్ గా వచ్చిన వెన్నెల కిషోర్( Vennela Kishore ) అద్భుతమైన నటనతో కడుపుబ్బ నవ్విస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను పొందుతూ ఇండస్ట్రీ లో ఎదుగుతూ వస్తున్నాడు కాబట్టి శ్రీనివాస రెడ్డికి అవకాశాలు తగ్గిపోయాయనే చెప్పాలి.

ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?
Advertisement

తాజా వార్తలు