స్టార్‌ హీరోల దీపావళి సర్‌ ప్రైజ్‌ లు ఎక్కడ భయ్యా...!

టాలీవుడ్ స్టార్ హీరోలు దీపావళి పండుగ ను( Diwali Festival ) బాగానే జరుపుకున్నారు.పార్టీ లకు హాజరు అయ్యారు, వేడుకలు జరుపుకున్నారు.

కానీ వారి అభిమానులు మాత్రం పండుగ విషయం లో నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.స్టార్ హీరోల్లో చాలా మంది సినిమా లకు సంబంధించిన అప్డేట్స్ వస్తాయని వారు ఆసక్తి గా ఎదురు చూశారు.

ముఖ్యంగా రామ్ చరణ్ సినిమా యొక్క టీజర్ లేదా ప్రత్యేకమైన సర్ప్రైజ్ ఏమైనా ఉంటుందేమో అని అంత ఆశ పడ్డారు.కానీ ఆశ అడియాశ అయింది.

గేమ్ చేంజర్‌ సినిమా( Game Changer ) యొక్క ఎలాంటి అప్డేట్ కూడా చిత్ర యూనిట్ సభ్యులు ఇవ్వక పోవడం తో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Tollywood Heroes Fans Unhappy About Diwali Festival Details, Game Changer, Ntr,
Advertisement
Tollywood Heroes Fans Unhappy About Diwali Festival Details, Game Changer, Ntr,

ప్రస్తుతం సినిమా కు సంబంధించిన షూటింగ్ స్పీడ్ గా జరుగుతున్న కారణం గా ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు అంటూ వారు ప్రకటించారు.ఇక మహేష్ బాబు గుంటూరు కారం సినిమా( Guntur Karam Movie ) విషయం లో కూడా అదే జరిగింది పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అసలు దీపావళి పండుగ గురించి పట్టించుకున్నట్లుగా అనిపించడం లేదు.ఇక ఎన్టీఆర్ దేవర సినిమా( Devara ) విషయం లో కూడా అభిమానులకు నిరుత్సాహమే ఎదురయింది.

Tollywood Heroes Fans Unhappy About Diwali Festival Details, Game Changer, Ntr,

మొత్తానికి ఏ మాత్రం దీపావళి సందడి లేకుండా చిన్నా చితక బాంబు లతో పండగ జరుపుకోవాల్సి వచ్చిందని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.భారీ చిచ్చు బుడులు లక్ష్మీ బాంబులు వంటి పటాసులు లేకుండానే దీపావళి టాలీవుడ్ జరిగిందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇక దీపావళి కి కొత్తగా సినిమాలు ఏమీ రాలేదు.

డబ్బింగ్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఈ సెలవల్లో చూసుకోవాల్సి వచ్చిందని కూడా అసంతృప్తి వ్యక్తం అవుతుంది.మొత్తానికి టాలీవుడ్ 2023 దీపావళి ని మిస్ చేసుకుంది అది ఎందుకు అనేది వారే చెప్పాలి.

నాన్న చనిపోయినప్పుడు ఏడుపు రాలేదన్న థమన్.. ఆయన చెప్పిన విషయాలివే!
Advertisement

తాజా వార్తలు