తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.రాష్ట్రంలోని ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి కావాలని పేర్కొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కేంద్రంలో మోదీని గద్దె దించేందుకు పునాదని రేవంత్ రెడ్డి తెలిపారు.ఈ క్రమంలో తెలంగాణలో గెలిచి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తామని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో డిసెంబరులో కాంగ్రెస్ సర్కార్ రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు.