Tollywood Actors: హీరో కాదు అలా అని విలన్ కాదు.. మంచి ఆల్ రౌండర్ నటులు వీరే !

నేను ఇంతే.ఇలాగే ఉంటాను.

అని గిరి గీసుకుని కూర్చుంటే ఏం లాభం ఉంటుంది చెప్పండి.

తమకంటూ ఎప్పటికి అప్పుడు కొత్త మార్కెట్ క్రియేట్ చేసుకుంటూ పోతేనే సినిమా ఇండస్ట్రీ లో నాలుగు కాలాల పాటు నిలబడి నాలుగు రాళ్ళూ కూడా వెనకేసుకోగలరు.

నిన్న మొన్నటి వరకు కేవలం హీరోయిజం మాత్రమే చూపించిన మన తెలుగు హీరోలు( Tollywood Heros ) తమ హద్దులను చెరిపేసి మంచి క్యారెక్టర్స్ తో పాటు నెగటివ్ పాత్రలు కూడా చేయాలనీ ఫిక్స్ అయిపోయినట్టు ఉన్నారు.అందుకే కొత్త పాత్రలు, విభిన్న సినిమాల్లో కనిపిస్తూ సందడి చేస్తున్నారు.

మరి రూటు మర్చి నిలబడిన ఆ నటులు ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Advertisement

ఈ లిస్ట్ లో అందరి కన్నా ముందు వరసలో ఉన్నారు జగపతి బాబు.( Jagapathi Babu ) అయన కాలం పెట్టిన పరీక్షా లో డిస్టింక్షన్ లో పాస్ అయ్యి టాలీవుడ్ స్టార్స్ కి విలన్ గా అదరగొడుతున్నారు.కేవలం తెలుగు లోనే కాకుండా సౌత్ తో పాటు ఫ్యాన్ ఇండియా రేంజ్ లో విలనిజం పండిస్తున్నారు.

ఇక హీరోగా ఆయనకు చాన్సు లేదు కానీ తండ్రిగా, విలన్ గా రెండు చేతుల సంపాదిస్తున్నారు.ఇక ఇదే దోవలో అల్ రౌండర్ అనిపించుకుంటున్నారు హీరో శ్రీకాంత్.

( Hero Srikanth ) అయన తన సొంత సినిమాల్లో హీరోగా నటిస్తూనే యంగ్ హీరోల సినిమాల్లో ప్రామినెంట్ రోల్స్ లో కనిపిస్తున్నారు.అందుకే అయన చేతిలో చాల ఆఫర్స్ ఉన్నాయ్.

హీరోగా మాత్రమే అంటే ఆయనకు ప్రస్తుతం మార్కెట్ చాల డల్ ఉండేది.కానీ సరైన టైం లో మంచి డెసిషన్ తీసుకున్నారు శ్రీకాంత్.

ప్రతి వారం 5 గ్రాముల బంగారం.. మణికంఠ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే!
ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?

జగపతి బాబు మరియు శ్రీకాంత్ మాత్రమే కాదు ఎప్పటి నుంచో తనకు సరైన సినిమాలు పడక మంచి నెగటివ్ పాత్రలో కనిపించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు హీరో రాజశేఖర్.( Hero Rajasekhar ) అయన ఎదురు చూపులు ఇన్నాళ్లకు వర్క్ అవుట్ అయ్యి నితిన్ ఎక్సట్రాడినరీ సినిమాలో( Extra Ordinary Man Movie ) అవకాశం వచ్చింది.అతి త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా తర్వాత రాజశేఖర్ కి మంచి అవకాశాలు వస్తాయని బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు.

Advertisement

మరి చూడాలి రాజశేఖర్ జీవితం ఎటువైపు మళ్లుతుందో.ఇక కమెడియన్ కం హీరో కం విలన్ కం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సునీల్( Sunil ) తెలుగు మరియు తమిళ్ లో ఫుల్ బిజీ అయిపోయాడు.

పుష్ప తర్వాత ఫ్యాన్ ఇండియా రేంజ్ లో అతడి రేంజ్ మారిపోయింది.

తాజా వార్తలు