ఉదయ్ కిరణ్ కూడా నెపోటిజం కి బలయ్యాడా..?

పలు టాలీవుడ్ చిత్రాలలో హాస్యనటుడిగా మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ తరహా పాత్రలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి నటుడు కాదంబరి కిరణ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

  అయితే కాదంబరి కిరణ్ తాజాగా ఓ ప్రముఖ మీడియా వెబ్ సైట్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

ఇందులో భాగంగా సినిమా పరిశ్రమకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.అయితే ఇందులో ముఖ్యంగా టాలీవుడ్ లో సినీ పరిశ్రమలో నెపోటిజం ఉందని స్పష్టం చేశాడు.

Actor Uday Kiran Faces Nepotism Issues In Industry, Udai Kiran, Tollywood Forme

 అంతేకాక గతంలో పలు ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఉదయ్ కిరణ్ ఆత్మహత్య విషయంపై కూడా స్పందించాడు.టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఉన్నటువంటి నేపోటిజం కి ఉదయ్ కిరణ్ బలైనట్లు సందేహం వ్యక్తం చేశాడు.

అలాగే అప్పటికే ఉదయ్ కిరణ్ వరుస హిట్లతో మంచి ఫామ్లో ఉన్నాడని, అంతేగాక తనకు తెలిసి ఉదయ్ కిరణ్ కి ఎలాంటి ఆర్థిక పరమైన లేదా ఆరోగ్య పరమైన సమస్యలు లేవని తెలిపాడు.అలాంటి యంగ్ నటుడు ఉన్నట్లుండి  ఆత్మహత్య చేసుకున్నాడంటే ఏదో బలమైన కారణం ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

Advertisement

అయితే ఈ విషయం ఇలా ఉండగా కాదంబరి కిరణ్  తెలుగులో పలు ధారావాహికలలో కూడా నటించాడు. అంతే గాక  అప్పట్లో దూర దర్శన్ చానల్ లో కూడా కొంత కాలం పాటు పని చేశాడు.

కాగా ప్రస్తుతం ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో తన సేవలను అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు