ఈటల పై టీఎంయు జనరల్ సెక్రటరీ ఫైర్.. ?

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం లో రోజుకో కొత్త ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇప్పటి వరకు టీఆర్ఎస్ నేతలే ఈటలను విమర్శిస్తూ వచ్చారు.

తెరవెనక జరిగే భాగోతం ఏంటో తెలియదు గానీ, ఈటలను మాత్రం ప్రజల్లో దోషిగా నిలబెట్టే కుతంత్రాలు జరుగుతున్నాయని ఆయన అభిమానులు అనుమానిస్తున్నారట.దీనికి తగ్గట్టుగానే అధికారపక్ష నేతలు పావులు కదుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Tmu General Secretary Thomas Reddy Fires On Etela Rajender, Telangana, TMU, Gene

ఇకపోతే ప్రస్తుతం రంగంలోకి ఈటలను విమర్శించడానికి ఆర్టీసీ సంఘాల వారు దిగారు.తాజాగా రాజేందర్ పై టీఎంయు జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి ఫైర్ అయ్యారు.

ఆర్టీసీ గురించి గాని, కవిత గురించి మాట్లాడితే మేము నోరు విప్పవలసి వస్తుందని హెచ్చరించారు.కష్టాల్లో ఉన్న ఆర్టీసీని సీఎం కేసీఆర్ ఆదుకున్నారని అలాంటిది వీరి పై విమర్శలు చేస్తే సహించేది లేదని వెల్లడించారు.

Advertisement
3 సెకన్లలో మూడు దేశాలలో అడుగు పెట్టిన అమ్మాయి.. ఎలాగంటే?

తాజా వార్తలు