Stress During Exams : రాబోయే పరీక్షలతో ఒత్తిడికి లోనవుతున్నారా..? అయితే ఇలా చేయండి..!

చాలామంది విద్యార్థులు రాబోయే పరీక్షలు( Exams ) కారణంగా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు.

అయితే పరీక్షల కోసం సిద్ధమయ్యేటప్పుడు లేదా పరీక్షలు జరుగుతున్నప్పుడు విద్యార్థులు కొన్ని విషయాలపై దృష్టి పెట్టుకుంటే ఒత్తిడిని అధిగమించవచ్చు.

దానికోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.పరీక్షల సమయంలో చాలామంది విద్యార్థులు సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వలన ఇబ్బందులు తలెత్తుతాయి.

ముఖ్యంగా జంక్ ఫుడ్( Junk Food ) తాత్కాలికంగా మంచి అనుభూతిని ఇస్తుంది.కానీ ఇది జీవ క్రియలను మందగింప చేస్తుంది.

అలాగే అలసటకు, బద్దకానికి కూడా దారితీస్తుంది.కాబట్టి ఈ సమతుల్య ఆహారం తీసుకోవడం పై దృష్టి పెట్టాలి.

Advertisement

ఆకుకూరలు, కూరగాయలతో కూడిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.అంతేకాకుండా పాలు, పెరుగుతో తయారుచేసిన పదార్థాలతో పాటు మాంసకృత్తులు కలిగి ఉన్న కోడి గుడ్డు( Egg )ను కూడా తినాలి.ఇక పండ్లలో అరటి, ఆపిల్, బొప్పాయి, సపోటా పండ్లను తీసుకుంటే మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది.

మంచి ఆహారం తీసుకోవడంతో పాటు శరీరంలో నీటి శాతం కూడా తగ్గిపోకుండా ఉండడానికి ప్రతి రోజు 8 పెద్ద గ్లాసుల నీటిని తాగాలి.ఇక పుష్కలంగా నీరు తీసుకోవడం వలన హైడ్రేటెడ్ గా ఉండడానికి, మీ చదువుకునే డెస్క్ పై వాటర్ బాటిల్ ను పెట్టుకోవాలి.

నీటితో పాటు, పుదీనా ఆకులు లేదా నిమ్మకాయలతో( Lemon Mint Juice ) తయారుచేసిన రసాయనాలను కూడా తీసుకోవాలి.కాబట్టి నీటితో పాటు జ్యూస్ తీసుకోవడం కూడా చాలా కీలకము.

ఆల్కహాల్ లాంటి ఉత్పేరక పదార్థాలు ఒత్తిడిని పెంచే అవకాశాలు అధికంగా ఉంటాయి.కాబట్టి వీటికి దూరంగా ఉండటమే మంచిది.

వైరల్ : కొడుకు కోసం ఆ తండ్రి బిర్యానీతో పడిన కష్టం.. ఎమోషనల్ స్టోరీ..
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 

సమయానికి ఆహారం తీసుకోకపోతే కూడా అనారోగ్యానికి గురిచేస్తుంది.ముఖ్యంగా పరీక్షల సమయంలో టైమ్ టు టైం భోజనం తప్పక చేయాలి.

Advertisement

పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు పరీక్ష సమయంలో భోజనం చేయకపోవడం వలన అనారోగ్యం, చికాకు తక్కువ శక్తికి దారితీస్తుంది. సరైన నిద్ర( Sleep ) లేకుండా చదవడం వలన శరీరంలో కూడా వివిధ రకాల ప్రభావాలు ఏర్పడతాయి.ప్రధానంగా ఒత్తిడి మరింత పెరుగుతుంది.

కాబట్టి విద్యార్థులు ఏడు నుండి ఎనిమిది గంటల వరకు బాగా నిద్రపోవాలి.సంపూర్ణ విశ్రాంతి ఉంటేనే పరీక్షల్లో తయారీకి ఉత్సాహం పుంజుకోవచ్చు.

పరీక్షల సమయం తక్కువగా ఉండటం వలన విద్యార్థులు ఏ సబ్జెక్టు ఎప్పుడు చదవాలి అన్న విషయంపై ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి.ఈ విధంగా ప్రణాళిక ప్రకారం చదువుకుంటే ఒత్తిడి( Exams Stress )ని అధిగమించవచ్చు.

తాజా వార్తలు