Suresh Babu Venkatesh Rana : వెంకటేష్ ను స్టార్ హీరోగా చేసిన సురేష్ బాబు రానా ను ఎందుకు స్టార్ హీరో చేయలేకపోతున్నాడు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరిలో విక్టరీ వెంకటేష్( Victory Venkatesh ) ఒకరు.ఈయన చేసిన వరుస సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

 Suresh Babu Who Made Venkatesh A Star Hero Why Cant He Make Rana A Star Hero-TeluguStop.com

వెంకటేష్ యూనివర్సల్ సబ్జెక్టులను డీల్ చేసే హీరోగా ఇండస్ట్రీలో అన్ని జానర్స్ సినిమాలు చేస్తూ వచ్చాడు.ఇక ఇదిలా ఉంటే వెంకటేష్ ఏ సినిమాలు చేయాలి ఎలాంటి సినిమాలు చేస్తే తనకు సక్సెస్ వస్తుంది అనే దానిమీద వాళ్ళ అన్నయ్య అయిన సురేష్ బాబు( Suresh Babu ) దగ్గరుండి స్క్రిప్ట్ లు రెడీ చేయించి సినిమాలను తెరకెక్కించేవారు.

ఇక ఇలాంటి క్రమంలోనే వెంకటేష్ కు వరుసగా సక్సెస్ లు రావడం ఆయన స్టార్ హీరోగా గుర్తింపు పొందడం జరిగాయి.సురేష్ బాబు వెంకటేష్ ని ఎలాగైతే స్టార్ హీరోగా మార్చాడో మరి ఇప్పుడు తన కొడుకు అయిన రానా ని ( Rana ) మాత్రం స్టార్ హీరోగా మార్చడం లో చాలా వరకు ఫెయిల్ అయ్యాడు అనే చెప్పాలి.లీడర్ సినిమాతో( Leader Movie ) హీరోగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన రానా మొదటి సినిమాతోనే నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Suresh Babu Who Made Venkatesh A Star Hero Why Cant He Make Rana A Star Hero-Su-TeluguStop.com

ఆ తర్వాత ఆయన కొన్ని మంచి సినిమాలు చేసినప్పటికీ అవి ఏవి కూడా పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు.దానివల్ల ఆయన విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు రకాల పాత్రలు పోషిస్తున్నాడు అంతే తప్ప హీరోగా ఆయన చేసే సినిమాలు మాత్రం చాలా తక్కువ సంఖ్యలో వస్తున్నాయి.అందులోనూ ఆ సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో ఆయన సోలో హీరోగా సక్సెస్ సాధించలేకపోతున్నాడు.

ఇక ఇప్పుడు దానికి తగ్గట్టుగానే సురేష్ బాబు రానా కెరియర్ ను కూడా కొంచెం గాడిలో పెడితే బాగుంటుంది కదా అంటూ దగ్గుబాటి అభిమానులు సురేష్ బాబు మీద ఫైర్ అవుతున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube