తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటు ముందుకు సాగుతున్నారు.ఇక ఇలాంటి క్రమం లో అప్పట్లో ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా ఎదిగిన నటుడు చిరంజీవి( Chiranjeevi ).
ఈయన చేసిన ప్రతి సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసేది.అందుకే ఆయనతో సినిమా అంటే ప్రతి దర్శకుడు ఇంట్రెస్ట్ చూపించడమే కాకుండా, చిరంజీవి సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ప్రొడ్యూసర్లు కూడా ఆయన వెంటపడేవారు.
ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది హీరోలు చిరంజీవితో పోటీగా సినిమాని రిలీజ్ చేయాలంటే భయపడిపోయేవారు.అందుకే మిగితా హీరోలు చిరంజీవి లేని సమయాన్ని చూసుకొని తమ సినిమాలను రిలీజ్ చేసుకొని సక్సెస్ లు సాధించేవారు.
కానీ కోడి రామకృష్ణ( Kodi Ramakrishna ) దర్శకత్వంలో చిరంజీవి చేసిన ‘రిక్షావోడు ‘ సినిమా రిలీజ్ అయి ప్లాప్ అయింది.ఇక అదే సంవత్సరం లో ఆర్.నారాయణమూర్తి హీరోగా వచ్చిన ‘ఒరేయ్ రిక్షా'(Orey Rikshaw ) సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది.దీంతో చిరంజీవిని ఢీ కొట్టి నారాయణమూర్తి సక్సెస్ సాధించడం అనేది అప్పట్లో ఒక హాట్ టాపిక్ గా మారింది.
కానీ ఆర్ నారాయణ మూర్తి జనాలని అట్రాక్ట్ చేయడంలో చాలావరకు సక్సెస్ అయ్యాడు.అయితే ఈ రకంగా జనాలని మెప్పించడంలో చిరంజీవి మాత్రం ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి.
ఆ రకంగా చిరంజీవి సాధించలేని ఘనతని ఆర్ నారాయణ మూర్తి( R Narayanamurthy ) సాధించడం వల్లే చిరంజీవి కంటే ఆర్ నారాయణ మూర్తి పై చేయి సాధించాడనే చెప్పాలి.ఇక ఈవెంట్ లో స్వయంగా చిరంజీవి ఈ విషయం చెప్పడం అనేది నిజంగా ఆయన గొప్ప స్వభావానికి నిదర్శనం అనే చెప్పాలి…ఇక ఇప్పుడు కూడా చిరంజీవి స్టార్ హీరోగా కొనసాగడం కాకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు…
.