అక్కడ కూడా దుమ్మురేపుతున్న టిక్ టాక్ స్టార్ దుర్గారావు...! అసలు విషయమేమిటంటే...?!

తెలుగు ప్రజలకు సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది సుపరిచితులు అయ్యారు.ఇకపోతే కొంతమంది చేసే వీడియోల ద్వారా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.

ఇది వరకు టిక్ టాక్ ఉన్న సమయంలో బాగా పేరు పొందిన వ్యక్తులలో దుర్గారావు కూడా ఒకరు.ముఖ్యంగా అతను బాగా పాపులర్ అయిన పాటలను ఎంచుకొని అందుకు సంబంధించి కాస్ట్యూమ్స్ వేసుకొని తన భార్యతో కలిసి ఇంట్లోనే బ్యాక్ గ్రౌండ్ సెటప్ చేసుకొని అందరిని నవ్వించే స్టైల్ లో ఆయన వీడియోలను తీస్తూ తెలుగు వారికి ఎంతగానో ఆకట్టుకున్నాడు.

ఇకపోతే టిక్ టాక్ ను ప్రభుత్వం దేశవ్యాప్తంగా బ్యాన్ చేయడంతో దుర్గారావు హవా కొద్దిరోజులు తగ్గింది.ఇది ఇలా ఉండగా కొద్ది రోజుల క్రితం దుర్గారావు జబర్దస్త్ షో లో ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

జబర్దస్త్ షో లో బాగా పేరు పొందిన హైపర్ ఆది స్కిట్ లో ఈయన తళుక్కున మెరిసి అక్కడ కూడా అదరగొట్టేశాడు.అలాగే జీ తెలుగు లో ప్రసారమయ్యే అదిరింది షో లో కూడా కనిపించి అక్కడ కూడా తన మార్క్ ను చూపించాడు.

Advertisement

ఇకపోతే టిక్ టాక్ ఉన్న సమయంలో ఆయన తన భార్యతో కలిసి అనేక సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ అదరగొట్టే అతను, ప్రస్తుతం టిక్ టాక్ లేకపోవడంతో ఆయన చేసిన డాన్సులను ప్రజలకు చూపించడానికి యూట్యూబ్ ఛానల్ ను మొదలు పెట్టేసాడు దుర్గారావు.ఇకపోతే ఈ ఛానల్ కు శేఖర్ మాస్టర్ కొందరు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు ఆయనను సపోర్ట్ చేశారు.

ఇకపోతే తాజాగా వీరి యూట్యూబ్ ఛానల్ కు లక్ష మంది సబ్ స్కైబర్లు చేరారు.అది కూడా కేవలం పదిహేను రోజుల్లో ఆయన ఈ మార్క్ ను సాధించాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రముఖులు ఉన్నా కాని వారు యూట్యూబ్ ఛానల్ పెట్టినవారికి ఇంత మొత్తంలో సబ్ స్క్రైబర్స్ ను సాధించలేకపోయారు.అలాంటి మార్క్ ను సైతం టిక్ టాక్ ఫేమస్ అయిన దుర్గారావు సాధించడం నిజంగా ఓ ఘనతే అని చెప్పవచ్చు.

దీంతో దుర్గా రావు దంపతులు తమ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు