'టైగర్ నాగేశ్వరరావు' ట్రైలర్.. డేట్ ప్రకటించిన నిర్మాత!

మాస్ మహారాజ రవితేజ( Ravi Teja ) ఇప్పటికి ఏడాదికి రెండు నుండి మూడు సినిమాలను రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.

ఇప్పటి వరకు మాస్ రాజా కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ గా నిలిచినా సినిమాలు ఉన్నాయి.

ఈ మధ్యనే వాల్తేరు వీరయ్య, ధమాకా వంటి బ్లాక్ బస్టర్స్ అందుకుని మరింత ఉత్సాహంగా ముందుకు వెళుతున్నాడు.ఇక ప్రజెంట్ మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao) నూతన డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రవితేజ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారడానికి సిద్ధం అవుతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్, సాంగ్ కూడా రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు.

ఇక రిలీజ్ కూడా దగ్గర అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.మరి తాజాగా ఈ ట్రైలర్ పై నిర్మాత అభిషేక్ అగర్వాల్( Abhishek Agarwal ) ఒక అప్డేట్ ఇచ్చారు.తన ట్విట్టర్ ఖాతా ద్వారా రెండు డేట్స్ ను పెట్టి ఏ డేట్ ట్రైలర్ కావాలి అంటూ పోల్ ద్వారా అడిగారు.

Advertisement

దీంతో ఎక్కువ మంది సెప్టెంబర్ 27న రిలీజ్ చేయమని కోరగా అదే డేట్ ను ఫిక్స్ చేసే అవకాశం అయితే ఉంది.

ఆ రోజు అయితే అప్పుడు రిలీజ్ అయ్యే అన్ని పాన్ ఇండియన్ సినిమాలతో ట్రైలర్ ను ఎటాచ్ చేస్తే ఈ సినిమాపై హైప్ బాగా పెరుగుతుంది అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.చూడాలి అదే డేట్ ను లాక్ చేస్తారో లేదో.కాగా నిజ జీవిత సంఘటనలతో 1970ల కాలంలో గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ స్వరాలు అందిస్తుండగా అక్టోబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.ఇక అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జిషు సేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్రేక్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.

అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...
Advertisement

తాజా వార్తలు