టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న సభలకు భారీ ఎత్తున ప్రజల నుండి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే.చంద్రబాబు ఎక్కడ సభ నిర్వహించిన జనాలు బ్రహ్మరథం పడుతున్నారు.
అయితే కొద్ది రోజుల క్రితం నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన సభలో ఒక్కసారిగా తోపులాట జరగటంతో ఎనిమిది మంది మృతి చెందటం తెలిసిందే.ఇదిలా ఉంటే నేడు గుంటూరు వికాస్ నగర్ లో చంద్రబాబు సభలో మళ్లీ అపశృతి చోటు చేసుకుంది.
పేదలకు జనతా వస్త్రాలు మరియు చంద్రన్న కానుక పంపిణీ చేస్తున్నట్లు టిడిపి నేతలు ప్రకటించడం తెలిసిందే.
దీంతో చంద్రబాబు సభలో ఉన్నంతసేపు సజావుగా సాగిన.
ఆయన వెళ్లిపోయాక పంపిణీ కార్యక్రమంలో తోపులాట జరిగింది.దీంతో నిర్వాహకులు జనాలను కట్టడి చేయలేక పోవడంతో ఓ మహిళ అక్కడికక్కడే చనిపోగా ఇద్దరు హాస్పిటల్ వెళ్లాక మరణించడం జరిగింది.
మరో ఇద్దరు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.వారి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ పరిణామంతో సభ నిర్వాహకులు పై ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.తాజా సంఘటనతో టీడీపీ క్యాడర్ లో మళ్ళి నిరుత్సాహం నెలకొంది.