టీఆర్ఎస్ ఇక పై బీఆర్ఎస్ ? వారిని ఒప్పించే పనిలో కేసీఆర్ ? 

తెలంగాణ రాష్ట్ర సమితి ని ఇకపై భారత రాష్ట్ర కమిటీ గా మార్చాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు .జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ , బిజెపిలకు ప్రత్యామ్నాయం గా  జాతీయ పార్టీని స్థాపించే ఆలోచనలో ఉన్నారు.

 Trs Longer Than Brs Kcr In The Work Of Convincing Them, Kcr, Ktr, Telangana, Trs-TeluguStop.com

  ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు మొత్తం పూర్తయింది.కెసిఆర్ కు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలు,  సూచనలు ఇస్తూ ఉండడంతో .పగడ్బందీగా తన నిర్ణయాలను అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.ఇక టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చేందుకు కెసిఆర్ తన ఫామ్ హౌస్ లో కసరత్తు మొదలు పెట్టారు.

ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న టిఆర్ఎస్ పేరును బిఆర్ ఎస్ గా మార్చేందుకు రెండు రోజుల్లో పార్టీ కార్యవర్గంతో కీలక సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం.
  ఇటీవల ఒకటి రెండుసార్లు పార్టీ కార్యవర్గ సమావేశాన్ని కేసీఆర్ నిర్వహించారు.

ఈ సందర్భంగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండవని ఆయన క్లారిటీ ఇచ్చారు.అయితే ప్రస్తుతం ఏర్పాటు చేయబోతున్న సమావేశాల్లో పార్టీ పేరును మార్చే విషయమై కెసిఆర్ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం .ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ కి ఎన్నికల సంఘం గుర్తింపు ఉంది.తామ పార్టీ పేరు మార్చితే గుర్తు మారే అవకాశం ఉండదని, పేరు మార్చడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఏర్పడతాయనే  విషయాన్ని పార్టీ కేడర్ కు కెసిఆర్ సూచించబోతున్నారట.
 

Telugu Brs, Telangana, Trs-Politics

దీంతో పాటు పార్టీ కేడర్ అంతా జనంలోకి వెళుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించాల్సిందిగా కేసీఆర్,  పార్టీ క్యాడర్ కు సూచించబోతున్నారట.ఎప్పటికప్పుడు దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కేసీఆర్ కు తగిన సలహాలు సూచనలు అందిస్తూ ఉండడం తో కేసీఆర్ ఆయన సూచనలతో మరింత ముందుకు వెళ్తున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube