ఓపెన్ అయిపోయారు : తెలంగాణ బీజేపీ లో లుకలుకలు ? 

తెలంగాణ బిజెపిలో గ్రూపు రాజకీయాలు మొదలైపోయాయి.ఎప్పటి నుంచో ఈ తరహా పరిస్థితి ఉన్నా,   ఎక్కడా మీడియా ముందు బయటపడకుండా అంతర్గతంగానే ఈ విషయాలపై వివాదాలు చోడు చేసుకునేవి.

 Opened Up: Telangana Bjp Is In Turmoil ,telangana Bjp, Bandi Sanjay, Telangana C-TeluguStop.com

అధిష్టానానికి ఫిర్యాదులు రహస్యంగా వెళ్ళేవి.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి చేయి దాటిపోయినట్టుగా కనిపిస్తోంది.

ఒకరిపై ఒకరు బహిరంగంగానే మీడియా ముందు విమర్శలు చేసుకోవడం ఇప్పుడు తెలంగాణ బీజేపీలో(BJP) మొదలైంది.ఇప్పటివరకు తెలంగాణ కాంగ్రెస్ లో ఈ పరిస్థితి ఉండేది.

అక్కడ ఆ పార్టీ ఎదుగుదల కంటే , మిగతా నాయకుల విషయంలో ఎక్కువగా దృష్టి పెడుతూ, వివాదాలకు దిగుతూ ఉండేవారు.దేని కారణంగానే తెలంగాణలో కాంగ్రెస్ బలం రోజురోజుకు తగ్గుతూ వస్తుంది.

Telugu Arvind, Bandi Sanjay, Brs, Kavitha, Mla Rajasingh, Telangana Bjp-Politics

వాస్తవంగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సి ఉన్నా.రెండుసార్లు జరిగిన ఎన్నికల్లోను పరాభవమే మిగిలింది.ఇప్పుడు అదే పరిస్థితి బీజేపీ లోను మొదలైనట్టుగా ప్రస్తుత పరిస్థితి చూస్తే అర్థమవుతుంది.ముఖ్యంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్(Arvind) చేసిన వ్యాఖ్యలతో ఈ విషయం బయటపడింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కవితపై బండి సంజయ్ విమర్శలు చేశారు.లిక్కర్ స్కామ్ చేసిన కవితను దర్యాప్తు సంస్థలు జైల్లో పెట్టకుండా ముద్దు పెట్టుకుంటాయా అంటూ సంజయ్ కామెంట్ చేశారు.

ఈ కామెంట్స్ ను  మొదట అందరూ పట్టించుకోలేదు.మూడు రోజుల తర్వాత బండి సంజయ్ వ్యాఖ్యలను తప్పుపడుతూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు బీఆర్ఎస్(BRS) తెరతీసింది.ఈ సందర్భంగా బండి సంజయ్ వ్యతిరేక వర్గం కూడా ఆయనపై విమర్శలు చేయడంతో పాటు,  సంజయ్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అరవింద్ డిమాండ్ చేశారు.

Telugu Arvind, Bandi Sanjay, Brs, Kavitha, Mla Rajasingh, Telangana Bjp-Politics

ఇక ఆ తర్వాత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరవింద్ వ్యాఖ్యలను తప్పుపడుతూ.ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు .ఇక విజయశాంతి సంజయ్ కు మద్దతుగా మాట్లాడారు.ఇప్పటికే తెలంగాణ బిజెపిలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి అనే వ్యాఖ్యలు వినిపిస్తున్న సమయంలోనే,  ఇప్పుడు ఆ గ్రూపు రాజకీయాలు జనాలకు తెలిసేలా బహిరంగం కావడం,  మరోవైపు చూస్తే తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం ఇవన్నీ బీజేపీ కి ఇబ్బందికర పరిస్థితులే తీసుకువస్తాయి అనడంలో సందేహం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube