శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవారు ఈ పనులు అస్సలు చేయకూడదు!

హిందూ క్యాలెండర్ ప్రకారం శివుడు లింగ రూపంలో కి ఉద్భవించిన రోజున శివరాత్రి పండుగను జరుపుకుంటారు.

ఇలా శివరాత్రి పండుగ రోజు దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలలో పెద్ద ఎత్తున భక్తులు చేరుకుని ఆ పరమేశ్వరుడిని దర్శించుకుంటారు.

ఇలా శివరాత్రి రోజు స్వామివారికి అభిషేకాలు అర్చనలు చేసి పూజించడమే కాకుండా ఉపవాసము జాగరణ చేస్తూ ఉంటారు.ఇలా భక్తిశ్రద్ధలతో ఉపవాసంతో స్వామివారికి పూజించి జాగరణ చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుందని చెబుతారు.

అయితే శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవారు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు.మరి ఆ పనులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

మహా శివరాత్రి రోజు పెద్ద ఎత్తున భక్తులు ఉపవాసంతో స్వామివారికి అభిషేకం చేస్తుంటారు.అయితే అభిషేకానికి పొరపాటున కూడా ఎరుపు రంగు నీటిని ఉపయోగించకూడదు.

Advertisement
Those Are Fast On Shivratri Day Should Not Do These Things At All , Mahashivarat

అలాగే స్వామివారికి పూజలో పసుపు కుంకుమను కూడా ఉపయోగించకూడదు.ఉపవాసం ఉన్నవారు పాలు పండ్లను తీసుకోవాలి.

అంతేకాని అధికంగా కార్బోహైడ్రేట్లు కలిగిన పదార్థాలను ముఖ్యంగా వెల్లుల్లి ఉల్లిపాయ వేసిన ఆహార పదార్థాలను తినకూడదు.అలాగే బియ్యం పప్పు ధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలను కూడా ఉపవాసం ఉన్నవారు తీసుకోకూడదు.

Those Are Fast On Shivratri Day Should Not Do These Things At All , Mahashivarat

ఈ విధమైనటువంటి ఆహార పదార్థాలను తినకుండా కేవలం పాలు పండ్లు ఏదైనా అల్పాహారం తయారు చేసుకొని తినాలి.ఇక ఉపవాసం ఉన్నవారు రాత్రి జాగరణ చేయాలి.జాగరణ చేస్తున్న సమయంలో వినోద భరితంగా జాగరణ చేయకుండా స్వామి వారి కథలను వింటూ లేదా భజన కార్యక్రమాలలో పాల్గొని మన మనసు మొత్తం స్వామివారిపై ఉంచి భక్తిశ్రద్ధలతో జాగరణ చేయడం వల్ల ఆ పరమేశ్వరుని అనుగ్రహం మనపై ఉంటుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి30, ఆదివారం 2025
Advertisement

తాజా వార్తలు